'ముందున్న జీవితం'

6:01 PM at 6:01 PM

'మీ జీవితం వైపే బాగా కళ్ళు విప్పి చూడండి ఎంత స్తబ్దంగా, ఎంత మూర్ఖంగా, ఎంత సంకుచితంగా ఉందో...' అంటాడు. ఎందుకలా జరిగింది? ఎలా బయట పడగలం?

ప్రపంచానికి పరిచితమైన గొప్ప తత్వవేత్త జె.కృష్ణమూర్తి.
సర్వ సమగ్ర మైన జీవితం ఎలా సాధించవచ్చో తన అద్భుత ఆలోచనలను ప్రసంగాలు గా అందించారు ఈ పుస్తకం లో. చివరివరకూ ఆసక్తి తో చదివేస్తాం.
నేను మొదటిసారి చదివి చాలా సంవత్సరాలు దాటింది.

మానవ జీవితం సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమ రంగులద్దుకుంటూ సంక్షోభం లోకి జారుతోంది,
నిరాశ, నిసృహ, దుఖం, ఆందోళన, భయం, అసూయ, ద్వేషం, హింస, పేదరికం, పోటీ, యుద్దం లేని ప్రపంచం కోసం ముఖ్యంగా విద్యావిధానం లోనే మార్పు జరగాలనే ఆశయం తో తన విద్యార్థు లను ఉద్దేశించి చేసిన ప్రసంగాలే ఈ ముందున్న జీవితం (లైఫ్ అహెడ్ కి అనువాదం).
సరళమైన శైలి తో సాగే ఈ పుస్తకాన్ని చదువుతున్నంతసేపూ మనల్ని మనం పరిశీలించుకుంటూనే ఉంటాం.
గతం లో ఎన్నో సార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నవీ, సమాధానాలు చెప్పుకున్నవీ నాకు దీన్ని చదువుతున్నంతసేపూ తారసపడుతూnనే ఉన్నాయి.
ఆ మాటకొస్తే జీవితం ఏమిటి? ఎందుకు? నిజంగా మనం చేస్తున్నదేమిటి? ఎందుకు? అని ప్రశ్నించుకునే ప్రతిఒక్కరూ దీన్ని చదువుతున్నంతసేపూ అవునివే నా మనసులోని వ్యథలు సరిగ్గా ఇతను చెప్పేదే నేనూ కోరుకుంటున్నది. అనుకోకుండా ఉండలేరు.

పుస్తకం విద్యార్ధులను ఉద్దేశించిన ప్రసంగాలు, వారి ప్రశ్నలకు ఆయన సమాధానాలతో సాగుతుంది.

విద్య జీవనోపాధి కొరకేనా?
విద్య ఎందుకు అభ్యసించాలని అనుకుంటున్నారు, జరిగిన చరిత్రలూ, వేరొకరి రచనలూ వీటి పై పట్టు సాధించటం మాత్రమే విద్య కాదు మీరు స్వయంగా నేర్చుకున్న వివేకం, ప్రజ్ఞ మాత్రమే నిజమైన విద్య
అది భయభీతి, సాంప్రదాయ మూసధోరణులు ఉన్నంతవరకు కుదరనిది, స్వేచ్చ లేకుండా వివేకం వికసించదు.
విద్య అనేది ఉద్యోగం, సంపాదన, పెళ్ళి, పిల్లలు, చిరాకులూ, వీటికోసమే నేర్చుకునేది కాక ఇష్టమైన పనిని ప్రీతితో చేయడానికి తగినa సునిశిత తెలివితేటలు పొందడానికి ఉద్దేశించినaదై ఉండాలి కాని నాడు ఆ విద్య జీవితాన్ని మరింత దుర్భర వేదనలో ఇరికిస్తుంది అన్వేషించి తప్ప అనుకరించి విద్య నేర్వకూడదు అంటాడు.
కర్తవ్యం అనేమాట మిమ్మల్ని హతమారుస్తోంది, బలిపశువుని చేస్తోంది అంటాడు ఒక చోట.
ఇలా దైవం, సమాజం, ప్రేమ, ఆకాంక్షపరత్వం, శాంతి, విధేయత, స్వతంత్రత, సత్యం, ఆదర్శం, వీటన్నింటికీ లోకం మనకి ఇచ్చే నిర్వచనాలకి భిన్నంగా నిర్వచిస్తాడు, వాటిని గురించిన ప్రశ్నలకి సమాధానం ఇస్తాడు.

నేను చెప్పానని ఇలాగే వీటిని ఆచరించకండి, మీ వివేకాన్ని మేలుకొల్పటం కొరకు నేను చెప్పినవాటిని ఉపయోగించుకొండి అంటాడు చివరగా.

ఊరికే అలా చదివే పుస్తకం కాదు. చదువుతున్నప్పుడూ ఆ తరువాత మనలో ఒకదాంట్లోంచి ఒకటిగా ఆలోచనా కిటికీలు తెరచుకుంటూనే ఉంటాయి.
11 comments:

ఉమాశంకర్ said...

తప్పక చదవాలి ఈ పుస్తకాన్ని.

మీ సమీక్ష కూడా బాగుంది.

చిన్నప్పటి నుంచి ఇదంతే, అదంతే అన్న రీతి లొ బతుకుతాం. కాస్త నాలుగు విషయాలు తెలిసి, ఎందుకలా? అని ప్రశ్నించుకొనే లోపు సగం జీవితం అయిపోతుంది..ఇదో విషాదం..

వింజమూరి విజయకుమార్ said...

రమ్యగారూ,

చాలా మంచి పుస్తకం గురించి చెప్పారు. జిడ్డు కృష్టమూర్తి గారి మాటలేవైనా జీవితాన్ని మొత్తంగా, సమగ్రంగా పరిశీలించి చెప్పినవే. మీరు ఆయన పుస్తకాన్ని అర్థం చేసుకోవడం నాకు నిజంగానే సంతోషం కలిగిస్తోంది. ఎందుకంటే అవి చాలామందికి మింగుడుపడే విషయాలు కావు. JK గారివి మరిన్ని పుస్తకాలు పరిచయం చేస్తూ, మీరు మరిన్ని చదివి జీర్ణించుకోవాలని అభిలషిస్తున్నాను. కృతజ్ఞతలు.

సుజాత వేల్పూరి said...

రమ్య గారు,
బాగుంది మీ సమీక్ష! కృష్ణ మూర్తి తత్వం మొదలుకొని కొన్ని చదివాను జె.కె పుస్తకాలు. మొదట్లో కొరుకుడు పడకపోయినా తర్వాత తర్వాత భలేగా నచ్చేసాయి. ఎంతగా అంటే తిరుపతి వెళ్ళినపుడు మదనపల్లి వెళ్ళి రిషి వాలీ స్కూల్ లో స్వయంగా పుస్తకాలు తీసుకునేంతగా! ఈ పుస్తకం చదవలేదు. తప్పక చదువుతాను. ఇలాగే మీ కంట పడ్డ మంచి పుస్తకాలు పరిచయం చెయ్యండి.

రవి said...

కృష్ణమూర్తి పుస్తకాలన్నీ ఉచితంగా చదవండిక్కడ.
http://tchl.freeweb.hu/

మీరు పరిచయం చేసిన పుస్తకం నాకూ చాలా ఇష్టం. బావుంది మీ పరిచయం...

Purnima said...

రవి గారు: మీరిచ్చిన లంకె రమ్య గారు పరిచయం చేసిన పుస్తకానికి ఆంగ్లానువాదమా? నాకక్కడ అన్నీ ఇంగ్లీషులోనే కనిపిస్తున్నాయి.

krishna rao jallipalli said...

అవును. అన్ని ENGLISH లోనే ఉన్నాయి. ఎవరినా తెలుగు ఇవ్వ గలరా??

ramya said...

ఉమాశంకర్ గారు మీరు చెప్పింది నిజం క్రమశిక్షణ తో పెరుగుతాం, మన పైని ముద్రలను గమనించేతంలో జీవితం లో వెన్నిక్కి తిరగలేనంత ముందుకు వెళతాం. చిన్న వయసునుండీ ఏదైనా గుడ్డిగా అనుకరిస్తూ ట్రెయిన్డ్ చేయబడతాం, చుట్టూ ఉన్నవారిలా నువ్వూ ఉండాలనే నిబంధన మనపై ఊహతెలిసినప్పటి నుండీ విధించబడుతుంది.
విధేయత, భయభక్తు లు, అనుకరణ మన ఎదుగుదలలో ముఖ్యంగా ఉన్నవి, అవి ఉన్నంతవరకూ మనిషి వివేకం వికసించదు అంటారు ఆయన.
అందుకే మనం అవన్నీ దాటిన ఎప్పటికో ప్రశ్నించు కోగలుగుతున్నామనుకుంటా.
విజయ్ కుమార్ గారు;థాంక్యు, తప్పకుండా మరిన్ని చదవాలనుకుంటున్నాను.

ramya said...

సుజాత గారు మీరు రిషి వాలీ స్కూల్ కివెళ్ళారన్నమాట, నేను ఎన్నోసార్లు అనుకున్నా, హార్స్లీహిల్స్ వరకు వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళడం కుదరలేదు,ఈ సారి వెళ్ళాలి.
@ravi గారు పుస్తకాల లంకె ఇచ్చినందుకు దన్యవాదాలు.
@pUrima గారు, Life Ahead కి తెలుగు అనువాదం ముందున్న జీవితం.
నాకైతే ఇవి తెర పై కాకుండా పుస్తకాలలో చదవటమే ఇష్టం కొద్ది కొద్దిగా చదివి దాన్ని గురించి ఓ రోజంతా ఆలోచించి తిరిగి మళ్ళీ దాన్ని చదివి అలా చదువుతూ మనలో ఏం జరుగుతుందో గమనిస్తూ చదవచ్చు.

@krishna rao గారు

ramya said...

@krishna rao గారు మీకిది విశాలాంద్ర లో దొరక వచ్చు, నేను కొని చాలా సంవత్సరాలై పోయింది, ఎక్కడో గుర్తులేదు. దానిపై వెల లేదు,@krishnamurti Foundation India. 64, Greenways Road, Madras- 600 028.

భరత్ said...

బాగుంది, ఆలొచింపచెసే విధంగా ఉంది.

Mitra said...

"మనలో ఒకదాంట్లోంచి ఒకటిగా ఆలోచనా కిటికీలు తెరచుకుంటూనే ఉంటాయి". పుస్తక సమీక్ష బాగుండి. ఇది మనలొని ఆలొచనాసరళిని మారుస్తుంది.