నా చేతి వంట

9:59 PM at 9:59 PM

ఈ రోజు ఉదయం పడక పైనుండి లేవగానే ఏంటో చుట్టూ అంతా తేడాగా అనిపించింది! కాసేపట్లోనే ఆ తేడా నాలోనేనని అర్ధమైంది. నిన్న అర్ధరాత్రి దాటేదాకా ఒకరి బ్రెయిన్‌ తింటూ బానేఉన్నా. ఇదేంటో తెల్లారేసరికి పుట్టెడు జలుబు,ఒళ్ళు నొప్పులు. ఎందుకొచ్చిదో నని ఆలోచిస్తే అర్ధరాత్రి తిన్న కీరా గుర్తొచ్చింది. అర్ధరాత్రులు ఆకలేస్తే కీరా దోస తినకూడదన్న సంగతి తెలుసుకున్నా!

ఒంట్లో బాగోక పోతే ఒంటరైపోతాం. ముఖ్యంగా మనలాంటి బ్రెయిన్‌ ఈటర్స్ కి కావలిసింది గొంతే అది పూడుకు పోయింది ఈ మాయదారి జలుబుతో, ఇంకేం.. వేటాడలేని ముసలి పులిలా ఒంటరినైపోయా. తినడానికి బ్రెయిన్‌ అంత గాక పోయినా అలాంటి రుచికరమైనదేమన్నా చేద్దామనుకున్నా. ఐడియా వచ్చింది, ప్రయోగం చేసేసాను. ఇదిగో నా చేతివంట.

మైక్రోఒవెన్‌ లో కజ్జి కాయలు.

7 comments:

కొత్త పాళీ said...

అయ్యో పాపం. అమ్మమ్మని పిలిచి మిరియాల కషాయం రెసిపీ కనుక్కోండి. :-)
ఇదేదో తమాషాగా ఉందే .. జలుబూ గొంతునొప్పీ వస్తే ఇలా కిచెన్లో క్రియేటివిటీ పెల్లుబుకుతుందా?

విహారి(KBL) said...

oven lo kajjikayala?

ramya said...

@కొత్తపాళీ ,ఏంటో మరి అలా పెల్లుబుకుతుంది :)
@విహారి,:)

Unknown said...

హహ... ఓవెన్లో కజ్జికాయలు. భలే.

అన్నట్టు కజ్జికాయలు తిన్న తరువాత జలుబు తగ్గిందేమిటి ?

ramya said...

@praveen, హ హ, జలుబుతగ్గలేదు గాని కాలరీస్ పెరిగాయి, దాంట్లో దండిగా నెయ్యి వేసిచేసా!

Rajendra Devarapalli said...

రమ్యగారూ,మీరెప్పుడు మా వైజాగ్ వచ్చి,మా సీతమ్మధార్లో,మాయింటిపక్క ఇంట్లో మీ మైక్రోఒవేన్,కజ్జికాయలతో దిగుతారో కాస్త చెప్పండి నాకొక్కడికే

ramya said...

వైజా కి వెళ్ళి సంవత్సరం దాటిందండీ ఈ మధ్య వచ్చే ప్రోగ్రాం కూడా లేదు , ఎప్పుడైనా వస్తే కజ్జికాయలు తప్పక తీసుకొస్తాను.