మై నేమ్‌ ఈజ్ మంగతాయారు.

8:03 PM at 8:03 PM


నేను టివి సీరియల్స్ చూడడం ఈ మధ్యకాలం లో్ దాదాపు మానేసాననే చెప్పొచ్చు.
ఈ టివి మొదలైన కొత్తల్లో కొన్ని బాలచందర్ సీరియల్స్ విడవకుండా చూసేవాళ్ళం, మర్మదేశం, రహస్యం లాంటివి తెగ సస్పెన్స్ గా అనిపించేవి. తరువాత్తరువాత మొదలైన ఫ్యామిలీ డ్రామాలు చూడలేక మెల్లిగా అన్ని రకాల సీరియల్స్ కీ దూరమయ్యా.
రాత్రి భోంచేసాక కాస్త టైమ్‌ దొరుకుతుంది తీరిగ్గా ఉంటా ఆ టైమ్‌ లో వచ్చే కొన్ని కుటుంబ కథా సీరియల్స్ చూడానికి ట్రై చేసి వల్ల కాక మానేసా.

ఇంకొన్ని 'అమృతం' లాంటివి చాలా బాగుండేవి గాని ఓ సంవత్సరమయ్యేసరికి కథ లు కాస్త పలచబడేవి. ఐనా అమృతం నా ఫేవరేటే, హీరో లని మార్చి మార్చి పాడు చేసేసారు లేకపోతే అదింకాబావుండేది.

సినిమా తారల సీరియల్స్ వచ్చాయి ఆ మధ్యన కొన్ని, మొదట్లో ఎలా ఉంటుందో నన కుతూహలం కొద్ది చూసినా కొద్ది రోజులకే ఆ వైపు కి పోవటం మానేడమో లేక ఆ సీరియల్ ఆగిపోవటమో జరిగేది.

ఆ మధ్య మా టీవీ లో 'యువ' మొదట్లో బానే ఉండె గాని ఏంటో ఇప్పుడంతా గందరగోళంగా తయారయ్యింది.

మళ్ళీ ఇన్నాళ్ళ కి(ఆ టైమ్‌ కి ఇంట్లో ఉంటే గనక) సీరియల్ టైమయ్యింది చూద్దాం అనుకుంటూ టీవీ ఆన్‌ చేసే సీరియల్ ఒకటి దొరికింది నాకు.
అదే.. మహేశ్వరి నటిస్తున్న మైనేమ్‌ ఈస్ మంగతాయారు. వినోదభరితమైన సీరియలే ఐనా కాస్త సెంటిమెంట్ రుచినీ తగిలించాr రు.
మహేశ్వరి కామెడీ సూపర్. అదరగొట్టేసింది. అసలెందుకో నాకు ఈ సీరియల్ లో ఆమెని చూడగానే నవ్వొచ్చేస్తుంది.

రామ్మొహన్‌ సరేసరి, అతను కనిపించగానే మనకు తెలియకుండానే పెదాలు విచ్చుకుంటాయ్ కాలు తాళం వేస్తుంది.

శ్రీధర్ వర్మ ది కాస్త హుందా పాత్రే ఐనా మహేశ్వరి తో దెబ్బలాడేటప్పుడు అతను పండించే కామెడీ తక్కువేంకాదు.

ఈ ముగ్గురూ ఒకరికొకరు ఎంతగా సూటయ్యారంటే వాళ్ళ స్థానం లో ఇంకే ఆర్టిస్టునీ ఊహించుకోలేం.

భలే సరిపోయారు ముగ్గురికిముగ్గురూ.

దీంట్లో ఇప్పటివరకూ జరిగిన కథేంటంటే, మహేశ్వరి తన తల్లి, చెల్లెల్ల తో కల్సి ఉంటుంది. తనే సంపాదించి ఇల్లు గడుపుతూ ఉంటుంది, అప్పులుంటాయ్. ఆమెకి పెళ్ళి సం్బంధాలేమీ కుదరవు వయసు మీరి పోతుందని తల్లి బెంగపడుతూ వుంటుంది. వాళ్ళకంటూ ఓ దొంగ మామయ్య తప్పించి ఇంకెవరూ ఉండరు.

శ్రీధర వర్మ, రామ్మోహన్‌ అన్నాతమ్ములు(కజిన్స్). వాళ్ళ హోటల్లో చెఫ్ గా పనిచేస్తూ ఉంటుంది మహేశ్వరి. ఆమెకి శ్రీధరవర్మ తో ఒక్కa క్షణం కూడా పడదు. గొడవపడి వెళ్ళి పోతుంది. అతను వేరే చెఫ్ తో అష్టకష్టాలూ పడి చివరికి అందrరి సలహాల మెరకు తింగరిదైనా ఆమే తన హోటల్ కి సరైనా చెఫ్ అని వెతుక్కుంటూ వచ్చి ఆమె డిమాండ్స్ కి ఒప్పుకుని మళ్ళీ ఉద్యోగం లో చేర్చుకుంటాడు, కాని ఇద్దరి కి ఎప్పుడూ పడదు దెబ్బలాడుకుంటూ ఉంటారు.

ఇక్కడ ఈ అన్నా తమ్ముళ్ళకి ఓ తాతయ్య (రంగనాధ్). ఈయనకి ఫ్లాష్ బ్యాక్ లో ఓ కూతురు. ప్రేమపెళ్ళి చేసుకునiి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అతను వాళ్ళపై బెంగపెట్టుకుని ఓ డిటెక్టీవ్ తో ఆరాతీయిస్తాడు. వాళ్ళు చనిపోయారని వారికి ఓ అమ్మాయి పుట్టిందని ఆమె ఎక్కడుందో తెలియదనీ తెలుసుకుంటాడు.
ఆ బెంగ తోనే చావుబతుకుల్లో ఉన్న తాతయ్య రెండ్రోజుల కంటే ఎక్కువకాలం బ్రతకడని తెలిసి ఈ ఇద్దrరు హీరోలూ
తాత సంతృప్తి గా కన్నుమూయాలని మహేశ్వరి ని ఓ రెండు రోజులు మనవరాలిగా నటించమని దానికiి బదులుగా ఆమె అప్పులని తీరుస్తారు. ఈమే తప్పిపోయిన మనవరాలని తాతని నమ్మిస్తారు.

ఆమె రెండ్రోజులకి నటించడానికి ఒప్పుకొని వచ్చాక తాత ఆరోగ్యం బాగైపోతుంది. ఆమె ని వదిలి ఇక క్షణం కూడా ఉండలేనంటాడు. ఆమె ఇంటికెళ్ళాలని పేచీ హీరోలేమో వెళ్ళనివ్వరు. రాత్రి కాగానే రహస్యంగా బాల్కానీ లోంచి దూకి ఇంటికెళ్ళిపోయి. హోటల్ కని తనిట్లో చెప్పి వీరింటికి వచ్చి తెల్లారే సరికి గదిలో ఉంటుంది...ఇలా సాగుతూ ఉంది కథ.

వాళ్ళ ముగ్గురి మధ్య జరిగే గొడవలూ, కథ లోని సంఘటనలూ భలే నవ్విస్తూ ఉంటాయి. మహేశ్వరి నటన హైలైట్.

వీళ్ళే కాక మిగతా పాత్రలూ అప్పుడప్పుడూ చక్కిలిగిలి పెడుతూ ఉంటాయి.
ఇప్పటికైతే బాగుంది సీరియల్ తరువాత్తరువాత సాగదీసి పాడుచేయకపోతే టివి లో వచ్చిన కొన్ని చక్కని సీరియలs్స్ లో ఇదీ చేరొచ్చు.

ఈ సీరియల్ నిర్మాత సినీ హీరో సురేశ్. దర్శకుడు వాసు ఇంటూరి.

(హెచ్చరిక; టీవీ సీరియల్స్ ఏ ఎపిసోడ్ నుండైనా ఎలాగైనా మారే ప్రమాదం గలదని గ్రహించగలరు.)

3 comments:

aswin budaraju said...

ఈ సీరియల్ గురించి మాట్లాడితే నాకు మన శ్రీదేవి గుర్తుకువస్తుంది,
ఈ సీరియల్ చూడమని అప్పుడు శ్రీదేవి తో జి-టివి వాళ్ళు యాడ్ ఇప్పించారు కూడా...
ఈసీరియల్ వచ్చే కొత్తొళ్ళో స్వాతి లో కూడ ప్రకటనలు,
కానీ నేనెప్పుడూ ప్రయత్నించలేదు.

కానీసీరియల్ అయిపోవటం కొంచం భయంగానే ఉంది లోలోపల ...
మీరు చెప్పరు కనుక ఓ ట్రైల్ వేస్తా.

సుజాత వేల్పూరి said...

ఎందులో వస్తోంది, రమ్య గారు, !జీ తెలుగా? అయితే నేను HYD వెళ్ళాక చూడాల్సిందే! BNGLR లో కొన్ని చోట్ల అది రాదు, dish ఉంటే తప్ప! మీలాగే అమృతం నా ఫేవరేట్ కూడా! శివాజీ రాజా ఉన్నప్పుడు మరీ!ఇప్పుడు మా టివి లో మళ్ళీ వేస్తున్నట్టున్నారు కదా! మీ హెచ్చరిక బాగుందండి!

ramya said...

@Aswin ప్రయత్నిచండి ఇప్పటిదాకా నైతే కామెడీ గా నే ఉంది, తాత క్యారెక్టర్ రాగానే కాస్త సెంటిమెంట్ పులుముకున్నట్లు అనిపిస్తోంది మరి మీ అదృష్టం బావుంటే ముందు కూడా బానే ఉంటుండొచ్చు.
sujatha గారు ఇంతకి ముందు ఎపిసోడ్స్ చూసిన వాళ్ళైతే పరవాలేదు ఇప్పుడే చూడ్డం మొదలు పెట్టిన వారు పాత కామెడీ సీన్స్ చూసుండరు. ఇక ముందు ఎలాగుంటుందో మరి కొత్త గావచ్చే సెంటిమెంట్ సీన్స్ చూసి నన్ను తిట్టుకోకుండా ముందు జాగ్రత్తన్నమాట ఆ హెచ్చరిక:)