"ఎ మాడెస్ట్ ప్రపోజల్"

2:34 PM at 2:34 PM

రెండేళ్ళకిందట చదివినా ఇప్పటికీ గుర్తొస్తే వెన్ను లోంచి వణుకొస్తుంది నాకు. ఇంత దాకా ఏ హారర్ సినిమా కూడా ననింత భయపెట్ట లేదు.
ఈ కథ చదివాక ఆ రోజంతా పిచ్చి చూపులు చూసాను, బుర్ర పనిచేయలేదు. వారం రూజులకి గానీ మామూలవలేదు,
ఎక్కడైనా జరిగే అవినీతి అర్ధమైతే ఈ కథే నాకు గుర్తొచ్చి చాలా భయమేస్తూ ఉంటుంది.(అణు బాంబు లక్కర లేదు అవినీతి చాలు దేశం సర్వ నాశన మై ముందు తరాల జీవితాలు నరకంగా మారడానికి).


వ్యంగ్య కథల్లో సందేశాత్మక ముగింపులు, సుఖాంతాలు ఉండవు. ఇదిగో ఇది ఇలా జరుగుతూవుంది. అని ఆలోచింప జేస్తాయి, జరిగే దానికి పర్యవసానం ఏమిటో చూపిస్తాయి.
ఈ కథ లో ఉన్నది వ్యంగం మాత్రమే కాదు, ఆ రచయిత ఆక్రోశం.

దేనికైనా పరిష్కారం చెపితే అది ఒక్కటే. కాని ఆలోచింపజేస్తే ఎన్నో పరిష్కారాలు.

ఇది నిప్పు తగిలితే కాలుతుంది. అని ఎన్ని ధియరీలు చెప్పినా పూర్తిగా అర్ధమవదు, కాని చెప్పకుండా కాస్త నిప్పుసెగ తగిలిస్తే, దాన్నెలా హాడిల్ చేయాలో బుర్రే మనకి చెపుతుంది. అది గొప్ప పాఠం.


ఇక కథ లోకి వచ్చే ముందు, ఫిబ్రవరి 2006 విపులలో ప్రచురిత మైన ఈ కథ గురించి వారు రాసిన మాటలే యధాతధంగా ఇవి.
నిత్య నూతనమైన మూడు శతాబ్దాల నాటి వ్యంగ్య రచన ఇది. పేదరిక నిర్మూలనకు పాలకుల దోపిడితనం పై ఎక్కు పెట్టిన అతి తీవ్ర వ్యంగ్య శరమిది.

మూడు వందల యాభై సంవ్త్సరాల క్రితమే పాలకులకు చురకలు అంటించడం తో పాటు ఒళ్ళూ గగుర్పొడిచేటంతటి వ్యంగ్య ప్రతిపాదనలతో సంచలనం సృష్టించిన ఈ రచన విపుల పాఠకుల కోసం ప్రత్యేకం.
అనువాదం:పినాకి.
ఇది రచయిత గురించి.
సుప్రసి్ద్ధ వ్యంగ రచయిత జోనాథన్‌ స్విప్ట్ (1667-1745) ఐర్లాండ్ లో జన్మించాడు తల్లి దండ్రులు ఇంగ్లీష్ వాళ్ళూ. ఆ నాటి సామాజిక అసమానతలను, పరిపాలకుల స్వార్ధరాజకీయాలను నిరసిస్తూ అనేక రచనలు చేసాడు. ఈయన మాస్టర్ పీస్ " గలీవర్స్ ట్రావెల్స్" నుపిల్లల పుస్తకంగా పరిగనించటం ఆనాటి సాహిత్యకారు లు చేసిన తప్పi.ిదం

పదహారవ శతాబ్ది లోనే ఇంగ్లీష్ వాళ్ళూ ఐర్లాండ్ ను దోచుకోవటం ప్రారంభించారు. పన్నుల భారం తో నిరుపేదలు అల్లల్లాడి పోయారు . దీనికి తోడు క్షామం. ప్రజలకష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ఇంగ్లీష్ వాళ్ళ దురాశను కళ్ళార చూసిన స్విఫ్ట్1720 లో "ఎ మాడెస్ట్ ప్రపోజల్" అనబడే కరపత్రాన్ని ప్రచురించాడు. 'ప్రతిపాదన' చేసింది ఒక "ఆర్ధిక శాస్త్రజ్ఞ్డు డు." ఈ సలహా అమలు పరిస్తే ఐరిష్ ప్రజలు, ముఖ్యంగా పేదలు సుఖ సంతోషా లతో, 'ఆరోగ్యంగా' ఉంటారు.


కథ లోకొస్తే.. దీంట్లో సంభాషనలూ అంటూ ఏమీ వుండవు ఒక వ్యాసం లా అప్పుడు అక్కడి ప్రజలకి రచయిత చేసిన ఒక వ్యంగ్య ప్రతిపాదన ఈ కథ.
పిల్లల్ని పోషించ లేని తల్లిదండ్రులు, బానిసలు, మష్టివారు మొదలైన నిరుపేదలకోసం. శిశువు ఏడాది దాటగానే తల్లి దండ్రుల మీద సమాజం మీద ఆధార పడకుండా, దేశ శ్రేయస్సు కు ఎలా తోడ్పడ గలదో, ఆశిశువుతో ఎలా ఎలా, ఏంమేం చేయవచ్చో అతి భయం కరమైన వ్యం్గ్యం తో సాగిన కథ.
ఇంతకు మించి దాని గురించి నేను రాయలేక పోతున్నాను, నా వల్ల కాదు కూడా అది రాయడం. ఎవరైనా ఇదివరకే ఈకథ చదివుండకపోతే ఆ ఫొటో కాపీ కావాలంటే జతచేస్తాను.

5 comments:

Viswanadh. BK said...

రమ్య గారు మీకు నా కృతజ్ఞతలు. నా బ్లాగులో అద్దె రూముల వేటపై కామెంటుకు సహాయం చేసినంత మాట అన్నారు. అదే ఆనందంగా ఉంది.కాకుంటే ముందు సరిగా స్థిరపడకుండా పెళ్ళి అంటే కొద్దిగా భయం అంతే.

Rajendra Devarapalli said...

నిజమే రమ్యగారు,పదిపన్నేండళ్ళ క్రితం మిసిమి పత్రికకోసం
జోనాధన్ స్విఫ్ట్ గురించి ఒక వ్యాసం రాస్తూ నేనూ నిర్ఘాంతపోయాను.త్వరలో ఆ వ్యాసం పునర్ముద్రిస్తున్నా.కానీ మీరు అలా క్లూ ఇచ్చినా ఇవ్వాళ చాలా మంది మొద్దుబారిపోయారు.ప్చ్..

ramya said...

విశ్వనాధ్ గారు,నిజమేనండీ స్థరపడ్డాకే పెళ్ళి.అక్కడ ఊరికే సరదా గా రాశానలా.ముందు మీ లక్ష్యా లని సాధించండి.
అవునింతకీ ఇల్లు దొరికిందా?

రాజేంద్ర గారు,తప్పకుండా. మీవ్యాసం ప్రచురించగానే ఓముక్క దానిగురించి టపా రాయండీ,దాని కోసం ఎదురుచూస్తుంటాను.
అవును క్లూ ఏంటండీ అర్ధం అవలేదు.

Mobchannel said...

Just saw your blog from www.mobchannel.com. Its a good agregator, you can find blogs of all indian languages including telegu and with a lot of good features. Please visit www.mobchannel.com.

Sri said...

Akali to A chinna sisuvulanu kosukuni tinali. A mansam ruchikarangavuntundi ani vachchina a katha naku gurthuvundi. dhaarunamaina katha.