శ్రీ రామదాసు

5:20 PM at 5:20 PM

ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా టీవీ లో శ్రీరామదాసు మళ్ళీ చూసాను ఇది రిలీజ్ అయినప్పుడు ఒకసారి చూసా, అప్పుడే రిలీజ్ ఐన సినిమా పై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో వెళతాం రెండో సారైతే ఊరికే సరదాగా చూస్తాం కనుక తప్పకుండా మనకు కలిగే ఫీలింగ్ లో తేడా ఉంటుంది. అప్పుడైతే నాకు చాలా చాలా ఇష్టమైన రామదాసు కీర్తనల కోసం,ఇంకా రామ దాసు కథ ని మహా మహు లు ఎలా చిత్రీకరించారో నన్న కుతూహలం తోటీ చూశాను.రాఘవేధ్రరావు తనదైన ముద్రతో చిత్రాన్ని రంగులతో ముంచెత్తాడు!
"శ్రీరామ నామం మరువం మరువం" అనే పాటతో టైటిల్స్ మొదలై ఆ కథ కి సంభందించిన వాతావరణం లోకి అడుగు పెట్టించేసారు.

అన్నమయ్య సినిమాలోలాగే దీంట్లో నూ కాస్త మసాలా చిలకరించారు. నేపధ్యం లో అందమైన దృష్యాలు, సెట్టింగ్ లు ,అందరి కలర్ ఫుల్ కాస్ట్యూంస్ మొదలైనవి చిత్రానికి చిక్కదనాన్ని ఇచ్చాయి.


నాగార్జున ఎప్పటిలాగే అలవోకగా నటించేసాడు కరుణ రసాన్నిచక్కగా పండిచాడు., స్నేహ కమలగా పాత్ర లో ఒదిగి పోయింది.కాష్ట్యూమ్‌ నగల తో బాపూ బొమ్మలా ఉంది,నటనaలోసౌమ్యతవెల్లiి విరిసింది.

గోపన్న ఎలా ఉండే వాడో తెలియదు గానీ దీంట్లో రాఘవేంధ్ర చేతిలో చాలా రోమాంటిక్, ఎనర్జిటిక్ హీరో గా కనిపించాడు.

చిన్నప్పుడు వినీ వినీ పాడుకున్న వే ఐనా పాటలు కొత్తగా అనిపించాయి,ఇప్పుడే మొదటి సారి వినేవారికి అద్భుతంగా ఉంటాయి. నా కైతే ఆ పాత కీర్తనలే ఇంకాస్త ఎక్కువ నచ్చుతాయి.తానీషా గా నాజర్ హుందాగానే కనిపించాడు. మటె సాబ్ పాత్ర కాస్త చిల్లర గా ఉంది.


ఇంకా అప్పుటి రాజకీయ సామాజిక పరిస్తితులు కూడా చేర్చి చూపితే బాగుండనిపించింది.
పాపికొండలు, గోదావరి అందాలu,పచ్చటి పరిసరాలు సినిమాకి అందాన్నీ,చూసేవారికి ఆహ్లాదాన్ని అందించాయి."అంతా రామ మయం "పాట లోనైతే ప్రకృతి ఇంకా అ్ద్భుతంగా వినిపించి కనిపించింది.

కౌలు కూడా కట్టలేని ప్రజల జీవితాలను బాగుపర్చిన అధికారి గా గోపన్న కనిపిస్తాడు.

మరి రాఘవేంధ్రుని సృష్టో నిజమో తెలియదు కానీ(నేనైతే ఇదివరకెక్కడా చదవలేదు) రామ భక్తుడైన కభీర్ మనవడి గా ఒక కభీర్ (నాగేశ్వర రావు) ఇందులో కనిపిస్తాడు.

ఇక కథేంటంటే.. గోపన్న మేనమావ ల సహాయం తో గోల్కొండ నవాబైన తానీషా దగ్గర కొలువు లో చేరి,పెళ్ళి చేసుకుని హస్నాబాద్ తహసిల్ దార్ గా వెళతాడు. అక్కడ పాత తహసిల్ దార్ పాలనలోని ప్రజలు పడ్డ కష్టాలని తీరుస్తూ ఉంటాడు. అక్కడి గూడెం లోని రామభక్తురాలైన దమ్మక్క చూపించిన రాముని విగ్రహాలు మరియూ ఆనవాళ్ళు చూసి రామ భక్తుడైపోయి రాముడు నడచిన ఆప్రదేశం లో రామునికి గుడి కట్టాలనుకుం టాడు. తను కూడా ఇల్లు విడచి అడవిలోనే ఉంటూ ప్రజల వద్ద చందాలు పోగెసి లక్ష వరహాలని పన్ను గా గోల్కొండ నవాబుకి పంపుతూ మిగతా ఆరు లక్షలతో ఆలయ నిర్మాణానికి అనుమతి కై కోరతాడు. దాన్ని పాత తహసిల్దారు నవాబుకి చేరనివ్వకుండా గోపన్నని ద్రోహి గా చూపాలనుకుంటాడు.


అంతలోకి కభీర్ మనవడైన కభీర్ వచ్చి గోపన్నకి శ్రీ రామతారక మంత్రాన్ని ఉపదేశించి, మందిర నిర్మాణం ఎందుకు చేయలేదని అడుగుతాడు. ప్రభువు అనుమతి ఇంకా రాలేదని అంటాడు గోపన్న. అసలైన రాముడి అనుమతే లభించాక ఇక ప్రభువుల అనుమతి అక్కరలేదని చెప్పి శ్రీరామపట్టాభిషేకానికి ఆ వషిస్టుడే పెట్టిన ముహుర్తానికి ఆలయ నిర్మాణం మొదలు పెట్టమని చెపుతాడు. అలా ఆలయ నిర్మాణం పూర్తవుతుంది గోపన్న శ్రీరామదాసు గా పిలవ బడతాడు.
సర్కారు అనుమతి లేకుండా ఆ పైకం వాడాడని తానీషా రామ దాసుని బంధించి హింసిస్తాడు. రామదాసు శ్రీరామునికై ప్రార్ధిస్తూ ఉంటాడు. తానీషా కి శ్రీరాముడు కలలో కనిపించి తన భక్తుడైన రామదాసుని వదిలేయమనీ ఆ పైకం తనిస్తాననీ చెపుతాడు.తానీషా మేలుకుని చూసేసరికి రాముని కాలం లోని రామమాడలు కనిపిస్తాయి, అప్పుడు తానీషా రామదాసు తో తనని మన్నించమని, అగ్రహారాలూ, బహుమతులూ ఇస్తూ తిరిగి తహసిల్ దార్ గా ఉండమనీ కోరతాడు. కానీ రామదాసు ఒప్పుకోడు తనకు ఎందుకు శ్రీరాముడు కనిపించలేదని బాధ పడుతూ "ధాశరధీ కరుణా పయోనిధీ..." అని పాడుతూ ప్రశ్నిస్తూ శ్రీరాముని దర్శించని జీవితం వద్దనుకుంటాడు. చివరకి శ్రీరాముడు దర్శనమిచ్చి కథ సుఖాంతం చేస్తాడు.

మొత్తానికి చాలా రోజుల తరువాత టీవీ ముందు కూర్చుని పూర్తి గా సినిమా చూసాను.7 comments:

Rajendra Devarapalli said...

no comment,congratulations for enjoying ramadasu and sharing your experiences so passionately with us.

కొత్త పాళీ said...

యేంటో ఈ సినిమాని జనాలు చాలా ఆడి పోసుకున్నారు గానీ నాకు బానే నచ్చింది. ఒక పక్క నాగార్జున, ఇంకో పక్క రాగవేందర్రావు, ..అంతే మరి, సినిమాని సినిమాలాగ చూడాలి.

Mallik said...

అసందర్భమైతే అవచ్చు గానీ, నాకైతే అన్నమయ్యలో కనిపించిన ఆర్ద్రత శ్రీ రామదాసులో కనిపించలేదు.

Anonymous said...

Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the TV de LCD, I hope you enjoy. The address is http://tv-lcd.blogspot.com. A hug.

రామ said...

మీరు చెప్పినట్టు అవసరం లేకపోయినా రాఘవేంద్రుడు "చేతివాటం" కొద్దీ మసాల దట్టించడానికి ప్రయత్నించారు.. నాకు అది ఎందుకో నచ్చలేదు.. ఒక సారి భక్తీ మోడ్ లో కి వెళ్ళిపోయి సినిమా తీస్తున్నాము అంటే, మరి ఇక అందులోనే వుండడం మంచిది. ఏదో నాలుగు మసాల సీన్ లు పెట్టడం వల్ల మాస్ ప్రేక్షకులు ఏమీ విరగబడి వచ్చెయ్యరు కదా? రిలీఫ్ కావలిస్తే రామదాసు కధ లో ను, కీర్తనల్లోనే బోలెడంత వుంది. అన్నమయ్య లో కూడా అదే అనిపించింది.. ఐతే, శ్రుతి మించకుండా జగ్రత్తపడ్డాడు అనిపించింది. మసాల తీసేస్తే, సినిమా మాత్రం తప్పకుండా బాగుంది.

Anonymous said...

అసలు అన్నమయ్య, శ్రీ రామదాసు రెండు సినిమాలు కూడ సవ్యంగా లేవు రెండిట్లోనూ చరిత్ర వక్రీకరించబడింది, ఇక్కడెవరో సినిమాని సినిమాలగా చూడమన్నారు, మిగతా వ్యాపారాత్మక చిత్రాలని సినిమాలాగే చూడాలి, కాని చారిత్రాత్మిక సినిమాలను ఒక మామూలు వ్యాపారాత్మక చిత్రాలలాగ చూడలేము, రెండిట్లోను నాగార్జున నూతిలో నుండి మాట్లాడినట్లు మాటలు. పాత్రల ఔచిత్యమే కనపడదు. ఇక కబీర్ దాస్ కాలం ఎప్పటిదీ. రామదాసు కాలం ఎప్పటిది..? ఇద్దరికీ దాదాపుగా 150 సంవత్సరాల తేడా ఉంది.! రెండు చిత్రాలను రాఘవేంధ్రరావు బ్రష్టు పట్టించాడు, ఒక్క సారి సంస్క్రుతం లో జి.వి.అయ్యర్ గారు తీసిన " ఆదిశంకరాచార్య " సినిమా చూడండి, వాగ్గేయకారుల చరిత్ర చిత్రాల ఎలా తీయాలో అదోక ఉదాహరణగా కనపడుతుంది..కమల్..!

Anil Dasari said...

>> "ఒక్క సారి సంస్క్రుతం లో జి.వి.అయ్యర్ గారు తీసిన " ఆదిశంకరాచార్య " సినిమా చూడండి, వాగ్గేయకారుల చరిత్ర చిత్రాల ఎలా తీయాలో అదోక ఉదాహరణగా కనపడుతుంది"

ఆది శంకరాచార్య కళాఖండమే కావచ్చు కానీ దాన్ని చూసిందెందరు? అడవిన వెన్నెల కాస్తే ఉపయోగమేముంది?