తేనెగూడు

4:15 PM at 4:15 PM

మా ఇంట్లో బైట ఆ మూలన ఈ తేనెపట్టు పెట్టాయి.

మామూలుగా ఇవి చెట్ల చిటారు కొమ్మల్లో ఉంటాయి కాని ఇది జనవాసాల మధ్య మా ఇంట్లో ఏ సీ వెనక మూలన పెట్టాయి.

దీన్ని తీసేసే్యాలంటే మంట పెట్టాలట. పాపం కొన్ని చనిపోతాయని బాధ, కాని అవి కుడుతాయి ఇరుగు పొరుగు ఊరుకోరు అందుకే తీయించాలి, కాని అవి చావకుండా తీసేందుకు వీలౌతుందేమో నని చూస్తున్నా.

4 comments:

సుజాత వేల్పూరి said...

రమ్య గారు,

అందరూ అనేదేమిటంటే, పౌర్ణమి తర్వాత, తేనే పట్టులో తేనె తేనెటీగలు పూర్తిగా తాగేస్తాయట! ఆ తర్వాత పట్టుని తీసేయొచ్చుట.(ఇందులో నిజమెంతో నాకు తెలియదు) ఆవ పిండిని తేనెపట్టు కింద నిప్పుల్లో వేసి ధూపం వేస్తే, ఆ ఘాటుకి అవి గాయపడకుండా నిష్క్రమిస్తాయి. ఇక చుట్టుపక్కల వాళ్లకి రిస్క్ ఎప్పుడైనా ఉంటుంది. ఆ పనేదో వాళ్ళకి ముందుగా చెప్పి తలుపులు వేసుకోమంటే సరి. తేనె పట్లు కొట్టే వాళ్ళు కొంచెం ట్రై చేస్తే దొరుకుతారు. (వాటిని చంపకుండా చూడటం ముఖ్యం కదా)

Rajendra Devarapalli said...

రమ్య గారు,ఇక్కడో ఉచితసలహా.ఎన్నాళ్ళనుంచి అక్కడ తేనేతుట్టె ఉందో మీరు చెప్పలేదు.వాటిని అక్కడనుండి తొలగించటం దాదాపు అసాధ్యం.మీరు అనుకున్న పద్ధతులలో.నాకు తెలిసి ఆంధ్ర విశ్వవిద్యాలయం యాంథ్రోపాలజి విభాగంలో గత ఇరవైఒక్కయేళ్ళుగా ఒకటి కాదు మూడు తేనెతుట్టెలున్నాయి.వాళ్ళు సైనేడ్ తో సహా అన్ని ప్రయత్నాలూ చేసారు.ఉ..హూ లాభం లేకపోయింది.కానీ నాకున్న అనుభవంలో అవి ఎవరినీ కుట్టలేదు.కానీ మీరుండే హైటెక్ నగరంలో మార్గాంతరం దొరుకుతుందేమో చూడండి

ramya said...

sujatha గారు అవునండీ అలా తీసివేసే వాళ్ళ కోసం ట్రై చే్స్తాను.

రాజేంద్ర గారు,అవి ఈ చుట్టు పక్కల ఎప్పుడినుండో ఉంటున్నట్టున్నాయి, ఎవరైనా తీయించగానే చుట్టుపక్కలే మరోచోట తిరిగి పెడుతున్నాయి,ఇవైతే మా ఇంట్లో ఎవరినీ కుట్టలేదు గానీ బటయ అందరూ భయ పడుతున్నారు, అదీ గాక చిన్న పిల్ల లు ఎవరైనా ఆడుతూ దాన్ని కదిలిస్తే..అదీ విషయం.
కాని నాకైతే పాపం వాటిని డిష్ట్రబ్ చేయాలనిపించదు.

ఓ బ్రమ్మీ said...

రమ్యగారు,

మీలో మానవత్వం ఎంత ఉందో మీ భాషలోనే అర్దం అవుతోంది. కానీ కొంచం తాత్వికంగా కూడా ఆలోచించగలరు. తేనేటీగల కర్తవ్యం మేమిటంటే, తుట్టేనిండా తెనెను సేకరించడమే.. తరువాత వాటి జీవితానికి లక్ష్యమేమిటి?

అందుకని, మనసు రాయి చేసుకుని, కొంచం కష్టమయినా తొందరగా తీయంచేయండి. తరువాత వాటికి కనుక భుద్ది మారి మిమ్మల్ని కుట్టాయనుకోండి ఆతరువాత మనం వైధ్యుడి చుట్టూ తిరగాలి.