maa cine awards 2008

2:23 PM at 2:23 PMశనివారం మా టీవీ వారి సినీ మా అవార్డ్స్ 2008 చాలా రోజులనుండీ ప్రకటన చూస్తున్నా. ఇవి చూసేయాల్సిందే నని శనివారం సాయంత్రం ఎక్కడికీ వెళ్ళకుండా ఏడు గంటలకే టీవీ మందు తయారయిపోయా! కెమరానీ పక్కన పెట్టుకుని కూర్చున్నా వీలైతే బ్లాగ్ లో ఫొటోలు పెట్టొచ్చని.
వ్యూయర్స్ ఒపీనియన్‌ పోల్ నిర్వహించి ప్రజలే న్యాయ నిర్ణేతలు గా అవార్డ్స్ ప్రకటించారట.


సాయంత్రం 7 గంటలకి టీవీ లో ప్రత్యక్షప్రసారం మొదలైంది. సుమ, అలీ (యాంకర్స్) దాన్ని నడిపించారు.
మధ్య మధ్య ప్రేమ్‌రక్షిత్, నికిత, శ్రద్దాఆర్య, యువ టీం.. డ్యాన్స్ లు,రేలారే పాటలకి ఉదయభాను స్టెప్పులు, దేవిశ్రీ, పాప్ సిగర్ ఆయేశా ఆటపాటా, పాడాలనిఉంది పైనలిస్ట్ చిన్నారులు పాడిన పాటలు.. అలరించాయి, ఎప్పటిలాగే బోల్డు వాణిజ్యప్రకటనలు విసిగించాయి.


ఇక అవార్డ్స్ విషయానికొస్తే..
బెస్ట్ ఎడిటర్---వర్మ-----చిరుత.
బెస్ట్ ఆర్ట్ డైరెక్టెర్ ---ఆనంద్ సాయి-----యమదొంగ.
బెస్ట్ యాక్షన్‌ డైరెక్టర్(ఫైట్ మాస్టర్)---విజయన్‌-----చిరుత.
బెస్ట్ సినిమాటోగ్రాఫర్---సెంధిల్ కుమార్-----యమదొంగ.
బెస్ట్ డైలాగ్ రైటర్---రత్నం-----యమదొంగ.
బెస్ట్ లిరిసిస్ట్ ---వనమాలి ------హ్యాపీడేస్(అరెరే).
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్----గీతామాధురి-----చిరుత.
బెస్ట్ స్టోరీ రైటర్---శేఖర్ కమ్ముల -----హ్యాపీడేస్.
బెస్ట్ కమేడియన్‌----బ్రహ్మానందం-----ఢీ.
బెస్ట్ విలన్‌----కెల్లీ డార్జీ------డాన్‌.
బెస్ట్ కొరియో గ్రాఫర్---ప్రేమ్‌ రక్షిత్-----యమదొంగ.
బెస్ట్ మ్యూసిక్ డైరెక్టర్---- మిక్కి జె.మేయన్‌-----హ్యాపిడేస్.
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్----శ్రీవాస్ ----- లక్ష్యం.
బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌--- హన్సిక----- దేశముదురు.
బెస్ట్ రిఫ్రెషింగ్ స్టార్ ---రామ్‌ చరణ్ తేజ్ -----చిరుత.
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్‌ ప్రామినెంట్ రోల్--- సుహాసిని------శ్రీ మహాలక్ష్మి.
బెస్ట్ యాక్టర్ ఇన్‌ ప్రామినెంట్ రోల్---మోహన్‌ బాబు------యమదొంగ.
బెస్ట్ మూవీ --------- హ్యాపీడేస్.
బెస్ట్ డైరెక్తర్--- శేఖర్ కమ్ముల -----హ్యాపీడేస్.
బెస్ట్ హీరోయిన్‌----త్రిషా------ ఆడవారి మాటలకు అర్ధాలేవేరులే.మధ్య మధ్య కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు.... కే.విశ్వనాధ్ కి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్, బ్రహ్మానందం కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిన సందర్భంగా సన్మానం జరిగాయి..


దీంట్లో ఇంకో ముఖ్య కార్యక్రమం మా టీవీ వారి కొత్త లోగో విడుదల. మా టీవీ సి.ఇ.ఒ.శరత్ ప్రకటించాక,
మా టీవీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ ---- మురళీ కృష్ణం రాజు, మ్యాట్రిక్స్ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున, అల్లూఅరవింద్, చలసాని రమేష్, వెంకటేశ్ రాజు. కొత్త లోగో ని ఆవిష్కరించారుసరె అన్నీ వచ్చాయ్ మరి బెస్ట్ హీరో అవార్డ్ గురించి రాయలేదేమా ననుకుంటున్న్నారా! ఆ విషయానికే వస్తున్నా...
ఊరించి..ఊరించి... రాత్రి 1.30 తరువాత ఇక బెస్ట్ హీరో అవార్డ్ అన్నారు... అంతే ఇంకేమీ రాలేదు.. ఆ ప్రోగ్రాం ఆపేసి ఓగంట సేపు యాడ్స్ వాయించి..తరువాత ఏదో పాత ఎపిసోడ్ రికార్డ్ వేసారు!
అవార్డ్ ప్రోగ్రాం ఎందుకు నిలిపేసారో కనీసం ప్రకటన కూడా ఇవ్వలేదు!
చూసీ, చూసీ ఇక ఇంతే అని అర్ధమై, ఒళ్ళు మండి బంగారం లాంటి నిద్రపాడైయిందని ఏడ్చుకుంటూ లేచా!
మొత్తనికి చివరాఖరికి పూర్తిగా చూపకుండానే తలుపులేసుకున్నారు.
..........


ఇప్పుడే అందిన వార్త బెస్ట్ హీరో ఎన్‌ టీ యార్---- యమదొంగ...

7 comments:

Unknown said...

మీకు చాలా ఓపిక అండీ అంత సేపు వేచి అవార్డులు చూసినందుకు :)
మళ్ళీ అన్నిటినీ నోటు చేసుకుని ఇలా బ్లాగ్ముఖంగా రాసినందుకు.

ఎంచక్కా ఇక మేము చూడక్కర్లేకుండా నివేదిక అందించేసారు.

Purnima said...

raatri antha koorchuni choodaleka poyinaa.. mee updates are helpful.At a go.. I could get every bit of information.

Thanks!!

Raj said...

నేను మాత్రం బెస్ట్ సింగర్ అవార్డు వరకు చూసి, వాణిజ్య ప్రకటనలతో విసిగిపోయి కంప్యూటరు కట్టేసా. మీ updatesకు నెనెర్లు.

oremuna said...

నేనా చానల్ మారుస్తున్నప్పుడు విశ్వనాథ్/ సన్మానం ఒక్కటి ఓ రెండు నిమిషాలు చూసి ఇదేదో సినిమా సెల్ఫ్ సోదిలే అని వదిలేసినాను.

ramya said...

@ప్రవీణ్ ~ మరేనండీ :) ఓ చేత్తో కెమెరా ఓ చేత్తో పెన్ను :D
ఇంకా చాలా ఫొటోలు తీసాను కాని అవి ఎక్కువైతే ముందు ముందు బ్లాగ్ లేటుగా తెరుచుకుంటుందేమోనని కొన్నే పెట్టాను.
@purnima :)
@raj :)
@oremuna :D

Anonymous said...

!!! :-) vasu.B

విహారి(KBL) said...

మీకు ఉగాది శుభాకాంక్షలు