శిల్పి

5:34 PM at 5:34 PM

నేను చూసిన హ్యారీపాటర్ సినిమాల గురించి .....> తెలుగురత్న లో.

నేను రాసిన కథ 'శిల్పి' ---> ప్రాణహిత వెబ్ పత్రిక లో

ఈ మధ్య బ్లాగు తెరవటమే కుదరలేదు, ఇంకో మూడునెలలదాకా ఇంతే బిజీ...!
ఇంకో రెండు రోజులైతే సంవత్సరం మారిపోతుంది ఈ యేడాది రాసినవి బ్లాగులో ఇప్పుడే ఎట్టెస్తే ఓ పనైపోతుంది :)

బ్లాగు మిత్రులందరికీ Happy & Prosperous New Year 2009
అసమర్ధులు

7:51 PM at 7:51 PM

నేను రాసిన కథ
ఈ మాట నవంబర్ సంచిక లో -->ఇక్కడ చదవండి

ఓ మొగుడి వ్యధ

12:45 AM at 12:45 AM

జిడ్డు మొహం, మడ్డిమెదడుది దీని బుర్రలో అసలు మెదడుందా! ఎంత తిట్టినా మిడిగుడ్లేసుకుని అట్లా చూస్తూంటది, దీని కసలు ఫీలింగ్స్ ఉండవా!
“ఓయ్ కాఫీ ఇక్కడపెట్టిపోతే..! నాకేవన్నా మంత్రవిధ్యలు వచ్చనుకున్నావా? చెప్పడానికి నీ నాలిక అరిగిపోతుందనా! చూడు నా కాలు తగిలి పడిపోయింది, వచ్చి తుడిచి తగలడు.”
ఆ చూపుకర్ధం ఏమిటో! టీ పాయ్ మీద కాళ్ళెందుకు పెట్టావనేమో! అసలు టీపాయ్ ఉన్నదే కాళ్ళు పెట్టుకోటానికి, దీనికేంతెలుసు గనక ఇది తెలియడానికి!
చీ! తడిబట్టేసి అచ్చం పనిమనిషి లాగే తుడిచేస్తుంది. కాస్త నాజూకుగా తుడవచ్చుగా! మోటు మనిషి.. నా ఖర్మ కొద్దీ దొరికింది.
సినిమాల్లో ఎంత అందంగా చేస్తారు! పనులన్నీ చేసినా జుత్తు చదరకుండా, చీర నలగకుండా, తలనిండా పూలతో నవనవలాడుతూ...!
ఇది పనులు చేస్తుంటే చూసే వాళ్ళు పనిమనిషే అనుకుంటారు తప్పించి ఇంటి ఇల్లాలంటే నమ్ముతారా!

ఆ మోహన్‌ గాడి పెళ్ళాం ఎప్పుడు చూసినా ఇస్త్రీ చీర నలగ కుండా కనిపిస్తుంది, వాడి అదృష్టం ఏం చేస్తాం!
ఆ మధూ..! వాడి పెళ్ళామైతే నెల తిరిగేసరికల్లా పదివేలు సంపాదించి వాడి చేతిలో పోస్తుంది. ఇదో దరిద్రగొట్టుది, దీనిపై ఖర్చే గాని దమ్మిడీ రాబడి లేదు.
హు… ఇప్పుడెన్ననుకుని ఏం లాభం! ఎక్కువ చదివిన వాళ్ళు మాట వినరనే గదా, చిన్న పిల్లైతే బుద్దిగా, ఒద్దికగా కాపరం చేసుకుంటుందని వెతికి, వెతికి దీన్ని చేసుకుంది. పెళ్ళి నాటికి డెబ్బై శాతం మార్కులతో ఇంటర్ పూర్తిచేసింది, మీకు ఇష్టమైతే చదివించండీ అన్నారు, చదివిస్తే ఉద్యోగం చేసేదే! కాని తనదేమో మరీ బీకాం తర్డు క్లాసు చదువు, చూస్తూ చూస్తూ దీన్ని బియ్యెస్సీ ఎలా చదివించగలం! ఐనా పెళ్ళాం సంపాదన తినే అదృష్టం అందరికీ ఉండొద్దూ!

దీని ముక్కేంటీ ఈ పక్కనుండి చూస్తుంటే నడ్డి ముక్కులాగుంది! పెళ్ళి చూపులనాడు అంత గమనించనేలేదు!
ఆ బల్బు వెలుతుర్లో కూర్చోబెట్టి చూపించారు, పచ్చటి పసిమి చాయ లాంటి రంగు అని మోసపోయా! ఆ.. ఏం రంగులే ఇదంతా మధ్యలోనే తిండివల్ల వచ్చిన రంగే, లేకపోతే ఇద్దరు పిల్లలూ అంత నల్లగా ఎందుకు పుడతారు! నేను నలుపే ఒప్పుకుంటా, నా పిల్లలైనా తెల్లగా ఉండాలనే గా దీనిరంగుచూసి చేసుకుంది.
ఇద్దర్ని కని గేదె లా తయారైయ్యింది! నాకు బయట సవాలక్షపనులు.. బలం కోసం నేను తినడం ఎలాగూ తప్పదు, పొట్ట ఇలా పెరగాల్సిందే, ఏం చేయలేం. ఐనా మగ వాడికి పొట్ట ఉంటేనే ఇంట్లో లక్ష్మి తాండవిస్తుందంటారు. ఆడది దీనికేం రోగం! కాస్త తిండి తగ్గించి సన్నబడచ్చుగా.

ప్చ్.. మొన్నటికి మొన్న.. రమణ మామ కొడుకు పెళ్ళికి దీన్నేసుకు వెళితే ఎంత అవమానంగా అనిపించిందనీ! ఆ శేఖర్ గాడిదీ తమది ఓ రెండ్రోజుల తేడాతో ఒకేసారి కదూ పెళ్ళైంది. వాడు, వాడి పెళ్ళాం కొత్తగా పెళ్ళైన జంటలా వచ్చారు అక్కడికి. వాడి పెళ్ళాం ఆ కారులోంచి దిగడమే ఎంత స్టైల్ గా దిగిందని! జుట్టు విరబోసుకుని ఎంత అందంగా తయారై వచ్చింది!
ఇదీ ఉంది కోతిలా నా వెనుక స్కూటర్ పై కూర్చుని గాలికి చిందరవందరైన జుట్టుతో, జడేసుకుని పల్లెటూరి గబ్బిలం లాగ!
ఆ పెళ్ళి లో మెరుపు తీగల్లా తిరుగుతూవున్న వాళ్ళని చూస్తూంటే ఈ బండది ఎంత రోత గా అనిపించిందో. ఖర్మ కాలి దీన్ని చేసుకున్నా.

చూస్తుంటే ఇది రోజు రోజు కీ పొట్టిగా ఐపోతున్నట్లు నాకు డౌట్! పెళ్ళి చూపులనాడు బానే కనిపించింది ఆ హైమని చేసుకోవాల్సిందా! ప్చ్ నేనే తిప్పి తిప్పి కొడితే ఐదున్నరకి రెండంగులాలు తక్కువే ఉన్నా, హైమ నాకంటే పొడవనే కదా ఆ సంబంధం వదులుకుంది. మామయ్య కూతుర్నైనా చేసుకోసుకునుండాల్సింది. అది నల్లగా ఉందని వద్దన్నా...., మొన్నటి పెళ్ళి కి తన భర్త తో కలిసి వచ్చింది, ఎంతబావుందని!
ఐనా దీని బాబు ఇచ్చే కట్నం మామయ్య ఇస్తానన్న దానికన్నా ఓ యాభై వేలు ఎక్కువని, అనవసరంగా తొందరపడి దీన్ని చేసేసుకున్నా! ఆ డబ్బ కాస్తా చెల్లి పెళ్ళికి చేసిన బాకీలకీ, వేరే పాత అప్పులు తీర్చడానికీ అప్పుడే ఖర్చైపోయింది.

పెద్దక్క మొదట చెప్పిన సంబంధం బాగుండే, బాగా డబ్బున్న వాళ్ళు, పైగా చిన్న పిల్ల.. ! ఆ… ఏం చిన్నపిల్లలే చిన్న పిల్ల మాటలా అది మాట్లాడింది!! జుట్టంతా గీకేసిన మరిగుజ్జు గొరిల్లా లాగా ఉన్నాడు నేను చేసుకోను అంది అందరిముందూ!! తనకేం తక్కువ? కాస్త మూతి ఎత్తుగా ఉన్నందుకే గొరిల్లా లా కనిపించానా దానికి!! తననొద్దనన్నందుకు దానికి తగిన శాస్తి జరిగింది, అందరికీ ఒంకలు పెడుతూ పెళ్ళీ పెటాకులు లేక ఇంకేం చేయాలో తోచక చదివీ, చదివీ ఇప్పుడేదో ఉద్యోగం చేస్తుందట. పెద్ద హోదా అని చెప్పుకు మురుస్తున్నారు గాని అదే నన్ను చేసుకునుంటే ఇప్పటికి ఇద్దరు పిల్లల్ని కని గౌరవంగా ఇంటిపట్టున హాయిగా ఉండేది. బైటకెళ్ళి అడ్డమైన చాకిరీ చేసే బాధ తప్పేది.
ఇప్పుడు చూడు ఆ అదృష్టం దీనికి పట్టింది.

అబ్బ ఎంత పొగరు! దీనికి? గుడ్డ తెచ్చి మొహాన కొట్టి పోయింది. జలుబు చేస్తే చీమిడి రాదేమిటీ? ఏదో లేవలేక ఇక్కడే చీది పడేసా, తరువాత ఎలాగూ తుడుస్తుంది కదా అని! దీనికే ఇదొక్కతే ప్రపంచంలో పరిశుభ్ర్తత పాటించే దానిలా!
నేను పెట్టే తిండి ఎక్కువై కొవ్వెక్కింది దీనికి.
ఆడపడుచు కట్నం దగ్గర పేచీ పడి ఒదులుకున్నాడు గాని ఆ సిక్రింద్రాబాద్ వాళ్ళ అమ్మాయి ఉమ ఐతే సిటీ పిల్ల అన్నివిధాలా బాగుండేది. ఈ పల్లెటూరి ముచ్చుమొహం దానికి ఓకల్చరూ లేదు పాడు లేదు. ఏదో ఆస్థివుంది ఒక్కతే పిల్ల అని ఆశపడి ఈ శని గ్రహాన్ని తెచ్చుకున్నా. పోనీ ఏమైనా పెట్టుపోతలు పెడుతున్నారా అంటే అదీ లేదు చెప్పుకుంటే సిగ్గు చేటు. ఆ పెళ్ళి నాడు ఇచ్చిందే!
ఏదడిగినా ఆ పొలం మాతరువాత మీకే కదండీ అంటారు దొంగ పీనుగులు వీళ్ళు ఎప్పుడు చావాలీ? ఏడాది కి ముష్టి మూడు జతల బట్టలు పెట్టి ఏదో పీతాంబాలు ఇచ్చినట్టు పోజులు! మహా ఐతే సంవత్సరానికి ఓ రెండు బస్తాల బియ్యం, ఇంటికి కావలసిన సరుకులూ అవీ పంపిస్తున్నారు, దానికే తెగ నీలిగి పోతున్నారు. అసలు ముందుముందు నాకు రావల్సిన పొలం లోని పండే పంటే కదా అదంతా, నా పంట నాకు పంపటం కూడా గొప్పేనా!

ఇంకేం మిగిలింది దీనికి! పెళ్ళిచూపులకి ముందు అక్క దీన్ని చూసొచ్చి అమ్మాయిది తాచుపాము లాంటి జడరా అని తెగ చెప్పింది. ఏం తాచుపాము! ఇప్పుడది వానపామైపోయింది. తనంటే ఆఫీసుకెళతాడు, ఎండలో బైట తిరుగుతాడు కనక తనకు బట్టతలైంది. అదీగాక మగవాడికి బట్టతల సిరిని తెస్తుంది అంటారు. ఆడదాని అందం దాని జట్టులోనే కదా ఉండేది. ఆ మాత్రం మెయింటేయిన్‌ చేసి చావద్దూ వెదవ పీనుగ!
హా.. హైనా ఇప్పుడెన్ని అనుకుని ఏం లాభం! నా తలరాత ఇలా ఏడిచింది.
ఏదో నాది విశాల హృదయం కనక ఇంకా దీన్ని ఏలుకుంటున్నా! ఈ జన్మ కి దీంతో అడ్జెస్ట్ అవ్వాల్సిందే తప్పదు.**************

'ముందున్న జీవితం'

6:01 PM at 6:01 PM

'మీ జీవితం వైపే బాగా కళ్ళు విప్పి చూడండి ఎంత స్తబ్దంగా, ఎంత మూర్ఖంగా, ఎంత సంకుచితంగా ఉందో...' అంటాడు. ఎందుకలా జరిగింది? ఎలా బయట పడగలం?

ప్రపంచానికి పరిచితమైన గొప్ప తత్వవేత్త జె.కృష్ణమూర్తి.
సర్వ సమగ్ర మైన జీవితం ఎలా సాధించవచ్చో తన అద్భుత ఆలోచనలను ప్రసంగాలు గా అందించారు ఈ పుస్తకం లో. చివరివరకూ ఆసక్తి తో చదివేస్తాం.
నేను మొదటిసారి చదివి చాలా సంవత్సరాలు దాటింది.

మానవ జీవితం సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమ రంగులద్దుకుంటూ సంక్షోభం లోకి జారుతోంది,
నిరాశ, నిసృహ, దుఖం, ఆందోళన, భయం, అసూయ, ద్వేషం, హింస, పేదరికం, పోటీ, యుద్దం లేని ప్రపంచం కోసం ముఖ్యంగా విద్యావిధానం లోనే మార్పు జరగాలనే ఆశయం తో తన విద్యార్థు లను ఉద్దేశించి చేసిన ప్రసంగాలే ఈ ముందున్న జీవితం (లైఫ్ అహెడ్ కి అనువాదం).
సరళమైన శైలి తో సాగే ఈ పుస్తకాన్ని చదువుతున్నంతసేపూ మనల్ని మనం పరిశీలించుకుంటూనే ఉంటాం.
గతం లో ఎన్నో సార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నవీ, సమాధానాలు చెప్పుకున్నవీ నాకు దీన్ని చదువుతున్నంతసేపూ తారసపడుతూnనే ఉన్నాయి.
ఆ మాటకొస్తే జీవితం ఏమిటి? ఎందుకు? నిజంగా మనం చేస్తున్నదేమిటి? ఎందుకు? అని ప్రశ్నించుకునే ప్రతిఒక్కరూ దీన్ని చదువుతున్నంతసేపూ అవునివే నా మనసులోని వ్యథలు సరిగ్గా ఇతను చెప్పేదే నేనూ కోరుకుంటున్నది. అనుకోకుండా ఉండలేరు.

పుస్తకం విద్యార్ధులను ఉద్దేశించిన ప్రసంగాలు, వారి ప్రశ్నలకు ఆయన సమాధానాలతో సాగుతుంది.

విద్య జీవనోపాధి కొరకేనా?
విద్య ఎందుకు అభ్యసించాలని అనుకుంటున్నారు, జరిగిన చరిత్రలూ, వేరొకరి రచనలూ వీటి పై పట్టు సాధించటం మాత్రమే విద్య కాదు మీరు స్వయంగా నేర్చుకున్న వివేకం, ప్రజ్ఞ మాత్రమే నిజమైన విద్య
అది భయభీతి, సాంప్రదాయ మూసధోరణులు ఉన్నంతవరకు కుదరనిది, స్వేచ్చ లేకుండా వివేకం వికసించదు.
విద్య అనేది ఉద్యోగం, సంపాదన, పెళ్ళి, పిల్లలు, చిరాకులూ, వీటికోసమే నేర్చుకునేది కాక ఇష్టమైన పనిని ప్రీతితో చేయడానికి తగినa సునిశిత తెలివితేటలు పొందడానికి ఉద్దేశించినaదై ఉండాలి కాని నాడు ఆ విద్య జీవితాన్ని మరింత దుర్భర వేదనలో ఇరికిస్తుంది అన్వేషించి తప్ప అనుకరించి విద్య నేర్వకూడదు అంటాడు.
కర్తవ్యం అనేమాట మిమ్మల్ని హతమారుస్తోంది, బలిపశువుని చేస్తోంది అంటాడు ఒక చోట.
ఇలా దైవం, సమాజం, ప్రేమ, ఆకాంక్షపరత్వం, శాంతి, విధేయత, స్వతంత్రత, సత్యం, ఆదర్శం, వీటన్నింటికీ లోకం మనకి ఇచ్చే నిర్వచనాలకి భిన్నంగా నిర్వచిస్తాడు, వాటిని గురించిన ప్రశ్నలకి సమాధానం ఇస్తాడు.

నేను చెప్పానని ఇలాగే వీటిని ఆచరించకండి, మీ వివేకాన్ని మేలుకొల్పటం కొరకు నేను చెప్పినవాటిని ఉపయోగించుకొండి అంటాడు చివరగా.

ఊరికే అలా చదివే పుస్తకం కాదు. చదువుతున్నప్పుడూ ఆ తరువాత మనలో ఒకదాంట్లోంచి ఒకటిగా ఆలోచనా కిటికీలు తెరచుకుంటూనే ఉంటాయి.
నీ ఆశ నీదే

8:14 PM at 8:14 PM

నేను రాసిన కథ , " నీ ఆశ నీదే"
ప్రాణహిత ఆగస్ట్ ఎడిషన్ లో మీ అమూల్య అభిప్రాయాలు కోరుతూ:)
http://www.pranahita.org/2008/08/ni_asha_neede/

నవ్వుతున్న ఏడుపు

4:05 PM at 4:05 PM

ఈ రోజు కూడా లేటైయ్యింది, చిన్నూ ఏడుస్తాడేమో! ఇయర్ ఎండిగ్ మూలంగా పనెక్కువగా ఉంది. ఏదో అలసట, చిరాకు మొరాయించే మనసు, శరీరాల్ని లాక్కెడుతూ ఇంకెంత కాలమో!
“వావ్ యువార్ లుక్కింగ్ వెరీ స్మార్ట్ టుడే!” గుట్కా నములుతూ వెకిలిగా నవ్వుతున్నాడు మేనేజర్.
ఎప్పుడూ అతికించుకునే ప్లాస్టీక్ నవ్వు తో అతని వైపు చూసి బయటకి నడిచాను.

బండి కూడా నాలాగే తయారయ్యింది! బ్యాటరీ వీక్ అయినట్టుంది, సర్వీసింగ్ కి ఇవ్వటానికి టైమేది! దిగి స్టాండ్ వేసి కిక్ రాడ్ పై నా విసుగంతా కుమ్మరించేశాను. నేను మాత్రం నువ్వంటే పడతానేమిటీ? అన్నట్లు అది రివర్స్ లో కాలిని విసురుగా తాకింది, మరింత విసురుగా నా కాలు దాన్ని నెట్టింది, అబ్బా ఏదో అయ్యింది, ఒహ్ కాలి గోరు లేచి వేలాడుతూ ఎర్రగా రక్తం! బండి నన్ను చూసి నవ్వినట్టనిపించింది. రియర్ మిర్రర్ లో నా మొహం కూడా నవ్వుతున్నట్టుగానే ఉంది!
వెర్రినవ్వు అలవాటై పోయింది! నాన్న కొట్టినా, అమ్మ తిట్టినా, అన్న తన్నినా మనం ఏడిస్తే ఓదార్చే వాళ్ళుండరని అర్ధమైన పసివయసులోనే ఏడుపు ఇంకి పోయింది.
ఆడ పిల్ల కి సహనం, దయ, కరుణ తప్పించి మరొక ఎమోషన్‌ ఉండకూడదని ఇంట్లో శిక్షణ మొదలైనప్పుడే పెదాలపై వెర్రి నవ్వు అతుక్కుంది.
కష్టాలు, బాధలు, అవమానాలు అన్నింటికీ ప్రతి స్పందన ఆడదానికి నవ్వే నని మెదడు చిన్నప్పుడే నేర్చేసుకుంది.

పళ్ళు బిగపట్టి మళ్ళీ కిక్.. ఉఫ్ స్టార్ట్ అయ్యింది.

రోడ్డు పై లైట్లు వెలుగుతున్నాయి. చల్ల గాలి దయగా పలకరిస్తోంది. కాలికింద జిగటగా రక్తమేమో! హాస్పెటల్ ముందు నుండి వెళుతున్నా, వెళ్ళి గోరు తీయించి డ్రెస్సింగ్ చేయించుకుంటే..! అమ్మో ఒద్దు ఇంకా లేటౌతుంది, హాస్పిటల్ వైపు చూసాను బైట జనాలు పడిగాపులుకాస్తున్నారు. ఎలాగో ఇల్లు చేరితే మెల్లిగా గోరు పీకి పడేస్తే సరిపోతుంది, ఇక్కడ టైమ్‌ వేస్టు.
ఏడుపొస్తే ఎంత బాగుండు! ట్రాఫిక్ సిగ్నల్ ఆపక తప్పదు! పక్కనే బైకు ఆపుకుని బైటకి గట్టిగా ట్రాఫిక్ ని తిట్టుకుంటున్నాడు ఎవ రో ఒక అతను.
నాకు తెలుసు ఇప్పుడూ నా నవ్వు చెరిగి పోనిదని, హాయిగా అలా చిరాకు పడగలిగితే బాగుండు!

హమ్మ ట్రాఫిక్ వదిలారు, ఇంకొక్క సిగ్నల్ దాటేస్తే ఇంటికి చేరినట్టే! ఆడవాళ్ళకి ఇంతసేపు పనెందుకు ఉంటుంది..! మా ఆఫీసు లో నాలిగింటికే బయలుదేరుతారు అంటాడు మాటి మాటికీ ఆయన!

పక్కన ఫుట్ పాత్ పై పడి దొర్లు తున్న పిచ్చి మనిషి! ఏది సున్నితమో అక్కడికి చేరుతుందేమో ప్రతి బాధ!
గుండె పట్టేసినట్టు గా ఉంది, ఏదో తెలియని బాధ.

ఇల్లు వచ్చేసింది, ఒక స్టెజ్ పైనుండి మరొక స్టేజ్ పై నటన! జీవితమంతా ఇంతేనా!

చిన్నూ గేటు దగ్గరే వెక్కుతూ నిల్చుని ఉన్నాడు, బండి కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చేశాడు.

“అమ్మా త్వరగా వస్తానన్నవ్? మళ్ళీ లేటు గా వచ్చావ్.”

వాచ్ మెన్‌ చేతికి బండి ఇచ్చి పార్కింగ్ లో పెట్టమని సైగ చేస్తూ, “ఏవయ్యింది?” అడుగుతూ చిన్నూని దగ్గరకి తీసుకున్నాను..

"అట్లాస్ తెచ్చావా?" సందేహంగా అడిగాడు.

"అయ్యో మర్చి పోయా నాన్నా!, చీ దానికేనా ఏడుపు ఏడవకూడదు." వాడిని ఓదారుస్తూ లిఫ్ట్ వైపు నడిచాం.

“నా వైట్ షూ చిల్లు పడిపోయింది కొనుక్కోవాలి త్వరగా రమ్మని చెప్పాగా, ఈ రోజు పీఇటీ సార్ కొట్టాడు! నాన్న ని అడిగితే నాన్న కూడా కొట్టాడు.” వెక్కుతూ చెప్పుకుపోతున్నాడు.

“రేపు తప్పక కొంటాను నాన్నా నువ్వు బంగారు కొండవు కదు ఏడవకూడదు, నాన్న ని విసిగించావా?”
కందిన వాడి లేత బుగ్గల్ని కళ్ళు హృ దయానికి చేరవేసాయి, అది భోరు మంటూ ఉంది.

రక్తం తో అతుక్కు పోయి రానంటున్న చెప్పు ని బలవంతంగా లాగి పడేస్తూ ఉంటే, హాల్లో టీవీలోంచి తల ఎత్తి గుర్రు గా చూసి నా చిరునవ్వు పలకరింపు తో మళ్ళీ టీవీ లో పడిపోయింది అత్తయ్య.

రామ కోటి పేపర్లు మడతపెడుతూ, "వీడి అల్లరి ఎక్కువై పోయింది, ముఖ్యమైన వార్తలు వినకుండా ఇంట్లొ ఒకటె గొడవ ఏడుపు. మళ్ళీ పదిన్నర తరువాత గానీ చూపించరు పూర్తి వార్తలు!"
విసుగ్గా ఆరోపిస్తున్నట్లుగా గట్టిగా చెపుతూ నా వెనుక నక్కిన చిన్నూ ని ఉరిమి చూశాడు మామయ్య.

అయ్యో అలాగా అన్నట్లు హావ బావాలు చూపుతూ లోనికి నడిచాను.

"పాపం వాడికి ఒహటే తల నెప్పిట అలసిపోయి ఆఫీసు నుండి వచ్చాడు పడుకో నివ్వకుండా వీడు ఊరికే సతాయించేస్తూ ఉన్నాడు." తన కొడుకుపై జాలి పడిపోయింది అత్తయ్య.

“అయ్యో ఏరీ ! పడుకున్నారా! టీ తాగారా, డిస్ప్రిన్‌ ఉండాలి ఇంట్లో, వేసుకున్నారా?” కుశలమడుగుతూ బాత్రూం లో టాప్ కింద కాలు పెట్టి నీళ్ళు వదిలా చుర్రు మంది.

“ఆ.. టీ తాగక? నువ్వొచ్చి ఇచ్చే వరకు ఎదురుచూడాలా, ఐనా వాడికి పెళ్ళం చేతి టీ తాగేంత అదృష్టమా!” హాల్లోంచి అత్తయ్య మాటలు వింటూ గోరు లాగిపడేసి, కట్టు కట్టుకుని, ఇల్లాలి వేషం కట్టుకున్నాను.
మిరపకాయ బజ్జీలు తెచ్చుకుతిన్నట్లున్నారు, టేబుల్ పై వదిలేసిన ముక్కలకి ఎర్ర చీమలు పట్టి ఉన్నాయి. చిన్నూ అటువైపు వెళ్ళకు జాగ్రత్త నా వెంటే తిరుగుతున్న చిన్నూ ని హెచ్చరిస్తూ గబ గబా శుభ్రం చేసి వంట పనిలో పడిపోయాను.

తిన్నా తినకపోయినా రెండుపూటలా వంట చేయక తప్పదు. పెళ్ళైన నాల్గు నెలలకే, కోడలు సరిగా అన్నం పెట్టలేదనీ, పాచి కూరలూ, అన్నం తిన్నామనీ కూతురితో చెప్పుకుని బంధువుల్లో దోషి గా నిలబెట్టేసారు.
“అన్నం తినకుండా ఎలా బ్రతికున్నారు? నా పై అభాండాలు వేసి ఇక్కడ అన్నం లేకుండా ఉండడమెందుకు? అంత బాగా చూసుకునే మీ అన్నలు ఎవరో ఒకరి దగ్గరa ఉండొచ్చుగా!” అంటూ భర్తనడిగింది ఆ రోజు.

“అన్నయ్య ల్లా నేను పెళ్ళాం చాటు వాజమ్మ ని కాదు! తల్లీ తండ్రీ తరువాతే నాకెవరైనా! నేను పెళ్ళి చేసుకున్నదే వాళ్ళకోసం, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేరనే నిన్ను చేసుకుంది. అత్తా, మామ లకి తిండి పెట్టడం కూడా నీకు బరువైన పనా? మీ వాళ్ళైతే ఇలాగే చేసేదానివా?”
భర్త మాటలకి సమాధానం చెప్పి ఒప్పించటం కన్నా ఓ పూట వంటే తేలికనిపించింది.

“అమ్మా ఆకలి” చిన్నూ మాటలకి ఈ లోకం లోకి వస్తూ వాడికి అన్నం కలిపి “ఇదిగో నేను కలిపింది అంతా వదిలేయ కుండా తినేయాలి వెళ్ళి హాల్లో కూర్చో.
అత్తయ్యా, మామయ్య గారు వడ్డిస్తున్నాను రండి” అందమైన చిరునవ్వు తో కూడిన నా పిలుపు అందుకొని లేచారు వాళ్ళు.

“మోకాళ్ళ నెప్పి అడుగు తీసి అడుగు వేయలేక పోతున్నా, రాధ దగ్గరున్నప్పుడు వారం, వారం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేది! అది మాత్రం ఉద్యోగం చేయడం లేదా ఏమిటి? నీలా రాత్రుల దాకా బయట తిరుగుళ్ళు దానికి లేవు ఇంటిని చక్కదిద్దుకునే సంసార లక్షణాలు గలది!”
తమని తరిమేసిన పెద్ద కోడలి గొప్పలు అత్తగారి నోటంబడి వినటం అలవాటై పోయింది.

“అయ్యో నెప్పి ఎక్కువగా ఉందాండీ! రేపు తప్పకుండా హాస్పెటల్ కి వెళదాం! మందులు ఉన్నాయిగా, రోజు వాడుతున్నారా?”

“ఆ ఉన్నాయిలే! పాడు మందులు పనిచేస్తాయా పాడా! ఇదేంటే.. వంకాయ వేయించావు? మేం భూమ్మీద ఇంకో నాల్గు రోజులు ఉండాలా వద్దా!” పళ్ళెం లో మరి కాస్త వంకాయ వేసుకుని తింటూ ధీర్ఘాలు తీస్తోంది.

“ఏంటీ సాంబారు చల్లగా ఉంది?” మామయ్య మాటలకి నా మతి మరపు ని తిట్టుకుంటూ సాంబారు గిన్నె తీసుకుని స్టౌ వైపు నడిచాను, వెనక వాళ్ళ మటలు వినిపిస్తూనే ఉన్నయి.

“సంధ్య పోన్‌ చేసిందని చెప్పావా?”

“ఏదీ మహారాణీ గారు ఇప్పుడేగా ఇంటికి చేరింది.”

వాళ్ళ ఒక్కగానొక్క కూతురు సంధ్య ఫోన్‌ చేసిందంటే ఏదో పెద్ద ఖర్చు మీదపడపోతుందన్నమాటే!

చిన్నూ పిలుస్తూన్నాడు “అమ్మా తినేసా.”

“గుడ్ వెళ్ళి పడుకో నాన్నా.” నా మాటలకి బుద్దిగా బెడ్ రూం కేసి వెళుతున్న చిన్నూ తో పాటు పరుగు పెడుతున్న మనసునీ, శరీరాన్నీ బలవంతంగా ఆపి పనిలో మునిగి పోయాను.

“సాంబారు వేసుకోండి, జాగ్రత్త వేడిగా ఉంది.”

“కొద్దిగా చాల్లే ఏదీ ఎక్కువ తినలేక పోతున్నా! ఉదయం సంధ్య ఫోన్‌ చేసింది వచ్చే వారం లీవు తీసుకో మళ్ళీ దొరకలేదంటావు” చెపుతూ తన భార్య వైపు చూసాడు మామయ్య మిగతాది నువ్వు చెప్పు అన్నట్టుగా.

“సంధ్య ఫోన్‌ చేసింది, నీకూ చేస్తే ఎంగేజ్ వచ్చిందట. వచ్చే శుక్రవారం అపార్టుమెంటు గృహప్రవేశం పెట్టుకున్నారట. ఇల్లు కొన్నుక్కుని రెండేళ్ళైనా కాలేదు మళ్ళీ అపార్టు మెంటు కొన్నుక్కున్నారని అందరూ తెగ ఏడ్చి పోతున్నారు అందుకే సింపుల్ గా చేస్తున్నాం అని చెప్పింది. అన్నా తమ్ముళ్ళు అంటూ ముగ్గురున్నారు ఏం లాభం? ఏదన్నా ఘనం గా చదివించాలి ఈ సారి!
నీకు మీ అన్నయ్య ఇచ్చాడు చూడు అలాంటి వెండి అష్టలక్ష్మీ బిందే, నిలువెత్తు దీపపు సెమ్మెలూ తీసుకు రమ్మని చెప్పింది. పాడు ఉద్యోగం వల్ల తీరికే దొరకదు వచ్చి పిలవలేక పోతునాను అని ఒకటే బాధ పడిందనుకో. పాపం అన్నీ అదే చూసుకుంటుంది ఒంటరి కాపురం !”
ఎప్పటిలాగే కూతురి ఎంత కష్టపడి పోతొందో వివరించడం మొదలెట్టింది అత్తయ్య

నాకు అన్నయ్య ఇచ్చాడా? పెళ్ళి లో పీడించి నాన్న దగ్గర వసులు చేసింది వీళ్ళేగా! ఎంత లోగా అందంగా ఎలా మార్చేశారు విషయాన్ని! ఆమె ఒక ఇల్లు కట్టి సంవత్సరమైనా కాలేదు అప్పటి గృహ ప్రవేశానికి వెండి డైనింగ్ సెట్టు కావాలి అంటూ దాదాపు వెండి వంటపాత్రలు అన్నీ కొనిపించుకు వెళ్ళింది! మళ్ళీ ఇప్పుడు...!

“వింటున్నావా? అన్నా తమ్ముళ్ళు బాగా సంపాదిస్తూ ఉన్నారు, ఏం లాభం? ఒక్కగానొక్క ఆడపిల్ల ప్రతి దానికీ దేవిరించుకొని అడుక్కోవలసిందే! నువ్వో రోజు లీవు పెడితే వెళ్ళి కొనుక్కు రావచ్చు అలాగే దానికీ, అల్లుడుకీ, పిల్లలకీ బట్టలు కూడా తీయాలి.”
నా తల గంగిరెద్దు లా ఆడుతోంది, పెదాలపై చిరునవ్వు తాండవిస్తోంది. నా మొహం లోకి పరీక్ష గా చూస్తూ చెప్పుకు పోతోంది అత్తయ్య. తను ఆశించిన చిరునవ్వు నామొహం లో చూసిందేమో ఎక్కువ రాద్దాంతం లేకుండా భోజనాలు ముగించి టీవీ ముందు సెటిల్ ఐపోయారు ఇద్దరూ.

“ఏవండీ! మీరూ రండి.. భోంచేద్దురు గానీ,”

“అమ్మా, నాన్నా సరిగా భోంచేసారా? ఎందుకింత లేటు చేస్తునావు? ఇలాగైతే వాళ్ళ ఆరోగ్యం ఏమౌతుంది? నీకస్సలు శ్రద్ద లేకుండా పోతోంది!” భోజనానికి కూర్చుని తల్లీ తండ్రీ వినేట్టు క్లాసు పీకడం మొదలెట్టాడు.

హు.. చిన్నవాడు ఆరోగ్యంగా పెరగాల్సిన వాడు తిన్నాడో లేదో పట్టదు వీళ్ళకి! ఇంత మందిలో వాడు ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ పెరుగుతున్నాడు! సొంత గా పెట్టుకు తినగలిగే వాళ్ళకి మాత్రం ఒకరు దగ్గరుండి చూసుకోవాలిట!

“ఏంటీ మొహం అదోలా పెట్టావ్?” అడుగుతున్న ఆయన్ని నమ్మలేనట్టు చూసాను.
ఓహో నా మొహం అదోలా కూడా మారుతుందా! వాష్ బేసిన్‌ దగ్గరున్న అద్దం లోని నా మొహం లోని చిరునవ్వు నన్ను నిరాశ పరిచింది.

“సాంబారు చల్లారి పోయింది.”

“మళ్ళీ వేడి చేసి తీసుకొస్తా.”

“ఇల్లంతా చెత్త కుప్ప లా తయారైయ్యింది! ఓ రోజు లీవ్ పెట్టి సర్దేయకూడదూ?”

“ఈ సండే ఓ రెండు గంటలు ముందుగానే లేచి సర్దేస్తా.” ఇంటి అందమే కదా, ఇల్లాలికి ముఖ్యమైనది.

వెండి బింది, సెమ్మెలు పుణ్యమాని వ్యంగపు బాణాలు లేకుండా ఈ రోజు భోజనాల కార్యక్రమం ముగిసింది. ఒంటరిగా ఎంత సేపైనా పనిచేసుకోగలను గానీ ఈ గంట భోజనాల తంతు ముగిసేసరికి నీరసం ముంచుకొచ్చేస్తుంది!
ఈ నా ఇంటిలో ఎక్కువ సేపు నేను గడిపే స్థలం ఈ ఎనిమిదడుగుల వంటగదే!
ఎంతసేపు, ఓ ఐదు గంటలు అలా పడుకుని ఇలా లేచి వచ్చేయనూ.. వంటగదితో వీడ్కోలు పలికి నడిచాను మరో స్టేజ్ పైకి మరో పాత్ర లోకి.
“చీ అలసిపోయినట్టు ఉంటావు ఉత్సాహంగా ఉండొచ్చుగా! పెద్ద ఉద్యోగం నువ్వొక్క దానివే చేస్తున్నావా! మా ఆఫీసుకొచ్చి చూడు ఆడవాళ్ళు ఎలా ఉంటారో పిట పిటలాడుతూ.”

పిడికెడంత హృదయం నెప్పి తట్టుకోలేక మూలుగుతోంది. పెదాలపై వెర్రి నవ్వు ఉండే ఉంటుంది!
జీవితం లో తీరని కోరిక మళ్ళీ మనసులో పురి విప్పుకుంటుంది, దిక్కులు పిక్కటిల్లేలా ఏడవాలని..
అమ్మో ఇప్పుడు ఏడవడానికి టైమ్‌ ఏదీ! పొద్దున్నేలేవాలి, స్టేజ్ పై నవ్వులు పూయించడానికి.
~~~~~~~~~~~~~~~~~~

స్త్రీలు -సినేమాలు

1:09 PM at 1:09 PM

మరీ పాతవి కొన్ని క్లాసిక్స్ అని చెప్పబడేవి చూసా, కొత్త సినిమాలు అంటే ఓ పదేళ్ళ లోపువి కొన్ని చూసాను. వాటి మధ్యలో వచ్చిన చాలా సినిమాలు నేను చూడనివే!
ఈ విషయం లో నాలెడ్జ్ మరీ పూర్ గా ఉందని.. టి వి లో వచ్చే అప్పటి సినిమాలు చూసేయాలని చానాళ్ళకిందే డిసైడయ్యా గాని అమలు పరిచే ధైర్యమే లేకపోయింది!

ఈ మధ్య రాజకీయ వార్తలు చూసీ, వినీ కూడా స్థిరంగా ఉన్నానంటే నా ఓపిక స్థాయి బానే పెరిగి పోయిందని నాకెందుకో ఓ గొప్ప నమ్మకం కలిగింది! ఇంకేం వీలుదొరికినప్పుడంతా ఆ సినేమాలు చూసేస్తే సరి! పోయేదేముంది అనుకున్నా!

అలా మొన్నో రోజు రెండు చానల్లో వచ్చే రెండు చిత్రరాజములను ఒకే సారి చూసేసా, మొత్తానికి!
ఓ దాంట్లో "మేఘసందేశం" నా చిన్నప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టమైన పాటలవటం వల్ల ఆ కేసెట్ తరచుగానే మోగుతుండేది. శానా గొప్ప సినెమా అని మనసులో ముద్రకూడా పడిపోయుండె!!

పాటల సంగతి పక్కన పెడితే. నా కైతే ఆ సినిమా అస్సలు నచ్చలేదు. నువ్వే సినిమా పూర్తిగా చూసావు గనక!! ఇదేనా నీ పెరిగిపోయిన ఓపిక?? అనే నా హృదయ గోస విని సరె ఈ మధ్య టీవీ న్యూసే మన ఆరోగ్యాన్ని ఏమీ చేయలేక పోయింది ఇదో లెఖ్ఖా! చూసే తీరదాం అనకునేసిన.

దీంతో బాటు మరొకటి బాలచందర్ ది సింధు భైరవి దాని పేరు.(తమిళ్ డబ్బింగు, ఈ సినిమా కి పొడిగింపు గా శహానా అనే సీరియల్ వచ్చిందామధ్య. ప్చ్ నేను చూడలే)
రెండూ మంచి సంగీతం, పాటలు కలిగిన పేరుకెక్కిన సినిమాలే .. కాని నాకు చిరాకునే మిగిల్చాయి. ( కథ వేరైనా ఈ రెండు సినిమాలూ ఒక్క కుదురు లోని మొక్కలే ననిపించింది).


స్త్రీల స్థాయి ని దిగజార్చటానికి అప్పట్లోని సినిమాలు గొప్ప కృషే చేసినట్టున్నాయి, మొన్నటికి మొన్న యధాలాపంగా ఓ సినిమా చూసా అదేంటో "కళ్ళు తెరిచిన కాళికో" ఏదో ఉంది పేరు, మాంచి మహిళా చిత్రం!

దాంట్లో ఇద్దరన్నాతమ్ముళ్ళు . అన్న మంచివాడు?! వ్యవసాయం చేస్తాడు(ఇతనికి సవతి తల్లన్నమాట),
తమ్మున్నేమో తల్లి పెద్దచదువులు చదివిస్తుంది.
ఇంక ఇటు అన్న సంసారం, అటు తమ్ముడి సంసారం మార్చి, మార్చి దర్శింపజేస్తూ ఉంటాడు దర్శకుడు.

ఓ పిచ్చి (జయచిత్రనుకుంటా ఆమె పేరు ) అమ్మాయి(ఆంటీ) ని పెళ్ళి చేసుకుంటాడు అన్న.

అక్కడ ఓ పెద్ద చదువులు చదివిన పెద్దింటి అమ్మాయిని చేసుకుంటాడు తమ్ముడు.

ఈ పిచ్చామ్మాయి ముగుడబ్బాయ్, మొగుడబ్బాయ్ అంటూ ముగుడ్ని ప్రేమిస్తూ ఉంటుంది, ఒంటిమీద సృహ ఉండదు.

ఆ పెద్దింటి అమ్మాయి మొగుడిని ఖరీదైన వస్తువులు తెమ్మని వెదిస్తూ ఉంటుంది. తెచ్చీ తెచ్చీ ఇక నా వల్ల కాదంటాడు. ఐతే నేనే ఉద్యోగం చేసి సంపాదిస్తా నని ఉద్యోగానికి వెళుతుంది.

ఆమె సరిగ్గా ఇంటిపట్టున ఉండనందున పాపం ఆయన గారికి టీ ఇచ్చే వారు ఉండరు,
పని మనిషే టీ ఇస్తూఉంటుంది వెనక దయనీయమైన మ్యూసిక్.
తన బ్రష్ పై పేస్టు తనే వేసుకుంటూ ఉంటాడు పాపం అభాగ్యుడు!
మొహం కడుక్కున్నాక టవల్ ఇచ్చేవారుండరు అష్ట కష్టాలూ పడుతుంటాడు!
కాళ్ళు పట్టడానికి భార్య ఉండదు, ముందటి కాళ్ళు పట్టే సీన్‌ గుర్తొస్తూ ఉంటుంది. మళ్ళీ వెనక మ్యూసిక్!
భోజనాల బల్ల దగ్గర కూర్చుంటే పనిమనిషి వడ్డిస్తూ ఉంటుంది, మళ్ళీ భార్య వడ్డించే సీన్‌ గురొస్తూ ఉంటే క్లోజప్ లో అతడి మొహం లో పెను విషాదం, వెనుక హృదయాన్ని పిండేసే సంగీతం!

ఇక అక్కడ అన్న గారి సంసారం హాయిగా గడచిపోతూ ఉంటుంది! మతిలేక హీరోయిన్‌ కేమీ తెలియదు. చీరకట్టుకోవటం పైటేసుకోటం కుడా తెలియదు.
హాయిగా అలా గడచిపోతూ ఉంటే ఆమె కి బిడ్డ పుడుతుంది. బిడ్డకి పాలివ్వటం కూడా తెలియని ఆమె ఓ గుళ్ళో పక్కన ఏడిచే బిడ్డని పెట్టుకు కూర్చొనుంటుంది. అప్పుడు దేవత (నిజ్జం ఒట్టూ!!!) వచ్చి పాలివ్వడం ఎలాగో నేర్పి వెళుతుంది!

వెంటనే ఈ హీరోయిన్‌ మామూలు గా మారిపోయి పెద్ద బొట్టూ, బుజాల చుట్టూ చుట్టుకున్న కొంగు తో బిందె పట్టుకుని నీళ్ళకెళుతూ ఉంటుంది! ఎంతో అవేశం తో ఆడవాళ్ళకందరికి ఎలా నీతితో మసలుకోవాలో చెపుతూ ఉంటుంది, మూర్ఖంగా కాకుండా ఆదర్శం గా ఉండాలంటుంది!!!?
విలన్లని చెంపల పై కొడుతూ, చెడ్డవారిని చెడామడా తిడుతూ ఉంటుంది.
పాతివ్రత్య నియమాలని, ధర్మాలనీ అడిగిన వారికీ అడగని వారికీ నేర్పుతూ, భర్త కి సేవలు(కాళ్ళు పట్టడం, నీళ్ళు పోయడం లాంటివి) చేస్తూ , చీదరించుకునే అత్తని దేవతలా భావించి సేవలు చేస్తూ... ఇంట్లో, పొలం లో పనిచేస్తూ, ఓ స్త్రీ ఎలా నడచుకోవాలో గుక్క తిరక్కుండా క్లోజప్ లో డవిలాగులు చెపుతూ… అలా… అలా… అలాఆ….

అక్కడ ఆ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఆఫీసు లోని వారంతా వేదిస్తూ ఉంటారు!

ఇక్కడింకో స్టోరీ ఈ అన్నా తమ్ముళ్ళకి ఓ చెల్లి ఉంది. ఆమె ని ప్రేమించి?! కడుపొచ్చాక చానా డబ్బులు తెస్తేనే పెళ్ళిచేసుకుంటానంటాడు ఒకడు!
అప్పుడు తల్లి కొడుకు లిద్దరినీ డబ్బు అడుగుతుంది.
(ఉద్యోగం చేసే) సొంత చిన్న కోడలేమో అత్తని నానా మాటలని తరిమేస్తుంది.
ఈ ( సవతి) పెద్ద కొడుకూ కోడలూ ఆమెని ఆదరిస్తారు. మేం కూలి చేసుకుని జీవిస్తాం నా పొలం తీసుకోమని హీరోయిన్‌ తన పొలాన్ని అమ్మి డబ్బు అత్తకిస్తుంది.


ఆ డబ్బుతీసుకుని మోసం చేసి, ఆ అబ్బాయికి వేరే పెళ్ళి జరిపిస్తూ ఉంటాడు అతడి తండ్రి.
మన హీరోయిన్‌ వీరావేశం తో అక్కడికి పోయి అందరి చెంపలూ వాయించి అక్కడి పెళ్ళి కూతురికి స్త్రీల గురించి పది నిమిషాల డైలాగ్ చెప్పేస్తుంది. ఆ దెబ్బకి పెళ్ళి కూతురు తాళి తెంపి పడేసి పారిపోతుంది.
మళ్ళీ అక్కడున్న వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కో ఐదేసి నిమిషాల డైలాగ్ చెప్పేస్తుంది హీరోయిన్‌ నీతి, న్యాయం, సమాజం, ఆడది, వివాహం, మగవాడు, పాతివ్రత్యం, నామొహం ఇలా అన్నింటి గురించీ నిర్వచనాలు ఇచ్చినా బుద్దిరాని ఆ పె. కొ. తండ్రి గూండాలని హీరోయిన్‌ పైకి తోలతాడు. ఈమె వారితో హోరాహోరీ పోరాడుతుంది( పవిట చుట్ట తొలగకుండా ఓచేత్తో పట్టూకునే).
కాసేపటికి ఆమె తల పగిలి పక్కనే ఉన్న కాళికా మాత విగ్రహం పాదాల పై పడిపోతుంది.

అప్పుడే…. అక్కడి విగ్రహం లోంచి ఓ దేవత శూలం పట్టుకుని వచ్చి డ్యాన్సాడి అందరినీ కసా పిసా పొడచి చంపేస్తుంది!
మన మంచి వాళ్ళంతా నిద్రలోంచి లేచినట్టు ఒక్క గాయం లేకుండా లేచి నిలుచుంటారు. అప్పుడు దేవత వారితో మట్లాడి మాయమైపోతుంది! ఆ పె.కొ. కి వీళ్ళ అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తారు.
( అసలు ఈ సినిమాలో దేవత రెండు సార్లు ఎందుకొచ్చిందో నా కిప్పటికీ అర్ధం కాలే! పోనీ ఆ హీరోయిన్‌ పిలవను కూడా పిలవలా, భక్తురాలూ కాదు!!)

ఇంక ఇప్పుడు అసలు క్లైమాక్స్ అక్కడ ఉద్యోగం చేసే అమ్మాయి ని ఆమె ఆఫీసు లో వాళ్ళంతా కలిసి రేప్ చేయబోతూ ఉంటారు!!!!?
అప్పుడు అన్నా తమ్ముడూ కలిసి ఎక్కడినుంచో ఒక్క సారిగా ఎగిరి దూకి డిష్ష్యూం.. డిష్యూం.. అంటూ ఆ ఆఫీసు కోలిగ్స్ అందరినీ తన్ని ఆమెని రక్షిస్తారు. అప్పుడే మన హీరోయిన్‌ వచ్చి చెల్లీ అంటూ ఆమెని ఓదార్చి ఆడదాని కర్తవ్యాలు సంసారలక్షణాలు, ఇంకా చాలా చాలా బోధిస్తుంది. అప్పుడు అక్కా చెల్లీ కలిసి పవిత్రంగా వారి భర్తల కాళ్ళకి మొక్కి. మనకు విముక్తి కలిగిస్తారు.

నా చేతి వంట

9:59 PM at 9:59 PM

ఈ రోజు ఉదయం పడక పైనుండి లేవగానే ఏంటో చుట్టూ అంతా తేడాగా అనిపించింది! కాసేపట్లోనే ఆ తేడా నాలోనేనని అర్ధమైంది. నిన్న అర్ధరాత్రి దాటేదాకా ఒకరి బ్రెయిన్‌ తింటూ బానేఉన్నా. ఇదేంటో తెల్లారేసరికి పుట్టెడు జలుబు,ఒళ్ళు నొప్పులు. ఎందుకొచ్చిదో నని ఆలోచిస్తే అర్ధరాత్రి తిన్న కీరా గుర్తొచ్చింది. అర్ధరాత్రులు ఆకలేస్తే కీరా దోస తినకూడదన్న సంగతి తెలుసుకున్నా!

ఒంట్లో బాగోక పోతే ఒంటరైపోతాం. ముఖ్యంగా మనలాంటి బ్రెయిన్‌ ఈటర్స్ కి కావలిసింది గొంతే అది పూడుకు పోయింది ఈ మాయదారి జలుబుతో, ఇంకేం.. వేటాడలేని ముసలి పులిలా ఒంటరినైపోయా. తినడానికి బ్రెయిన్‌ అంత గాక పోయినా అలాంటి రుచికరమైనదేమన్నా చేద్దామనుకున్నా. ఐడియా వచ్చింది, ప్రయోగం చేసేసాను. ఇదిగో నా చేతివంట.

మైక్రోఒవెన్‌ లో కజ్జి కాయలు.

అగ్నిహోత్రం

9:35 PM at 9:35 PM

వయసు,మతం లాంటి వాటితో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా చేయగలిగే చిన్న పాటి యజ్ఞం అగ్నిహోత్రం.


<= మా ఇంట్లో అగ్నిహోత్రం.
కాన్‌సెప్ట్ తెలుసుగా

మై నేమ్‌ ఈజ్ మంగతాయారు.

8:03 PM at 8:03 PM


నేను టివి సీరియల్స్ చూడడం ఈ మధ్యకాలం లో్ దాదాపు మానేసాననే చెప్పొచ్చు.
ఈ టివి మొదలైన కొత్తల్లో కొన్ని బాలచందర్ సీరియల్స్ విడవకుండా చూసేవాళ్ళం, మర్మదేశం, రహస్యం లాంటివి తెగ సస్పెన్స్ గా అనిపించేవి. తరువాత్తరువాత మొదలైన ఫ్యామిలీ డ్రామాలు చూడలేక మెల్లిగా అన్ని రకాల సీరియల్స్ కీ దూరమయ్యా.
రాత్రి భోంచేసాక కాస్త టైమ్‌ దొరుకుతుంది తీరిగ్గా ఉంటా ఆ టైమ్‌ లో వచ్చే కొన్ని కుటుంబ కథా సీరియల్స్ చూడానికి ట్రై చేసి వల్ల కాక మానేసా.

ఇంకొన్ని 'అమృతం' లాంటివి చాలా బాగుండేవి గాని ఓ సంవత్సరమయ్యేసరికి కథ లు కాస్త పలచబడేవి. ఐనా అమృతం నా ఫేవరేటే, హీరో లని మార్చి మార్చి పాడు చేసేసారు లేకపోతే అదింకాబావుండేది.

సినిమా తారల సీరియల్స్ వచ్చాయి ఆ మధ్యన కొన్ని, మొదట్లో ఎలా ఉంటుందో నన కుతూహలం కొద్ది చూసినా కొద్ది రోజులకే ఆ వైపు కి పోవటం మానేడమో లేక ఆ సీరియల్ ఆగిపోవటమో జరిగేది.

ఆ మధ్య మా టీవీ లో 'యువ' మొదట్లో బానే ఉండె గాని ఏంటో ఇప్పుడంతా గందరగోళంగా తయారయ్యింది.

మళ్ళీ ఇన్నాళ్ళ కి(ఆ టైమ్‌ కి ఇంట్లో ఉంటే గనక) సీరియల్ టైమయ్యింది చూద్దాం అనుకుంటూ టీవీ ఆన్‌ చేసే సీరియల్ ఒకటి దొరికింది నాకు.
అదే.. మహేశ్వరి నటిస్తున్న మైనేమ్‌ ఈస్ మంగతాయారు. వినోదభరితమైన సీరియలే ఐనా కాస్త సెంటిమెంట్ రుచినీ తగిలించాr రు.
మహేశ్వరి కామెడీ సూపర్. అదరగొట్టేసింది. అసలెందుకో నాకు ఈ సీరియల్ లో ఆమెని చూడగానే నవ్వొచ్చేస్తుంది.

రామ్మొహన్‌ సరేసరి, అతను కనిపించగానే మనకు తెలియకుండానే పెదాలు విచ్చుకుంటాయ్ కాలు తాళం వేస్తుంది.

శ్రీధర్ వర్మ ది కాస్త హుందా పాత్రే ఐనా మహేశ్వరి తో దెబ్బలాడేటప్పుడు అతను పండించే కామెడీ తక్కువేంకాదు.

ఈ ముగ్గురూ ఒకరికొకరు ఎంతగా సూటయ్యారంటే వాళ్ళ స్థానం లో ఇంకే ఆర్టిస్టునీ ఊహించుకోలేం.

భలే సరిపోయారు ముగ్గురికిముగ్గురూ.

దీంట్లో ఇప్పటివరకూ జరిగిన కథేంటంటే, మహేశ్వరి తన తల్లి, చెల్లెల్ల తో కల్సి ఉంటుంది. తనే సంపాదించి ఇల్లు గడుపుతూ ఉంటుంది, అప్పులుంటాయ్. ఆమెకి పెళ్ళి సం్బంధాలేమీ కుదరవు వయసు మీరి పోతుందని తల్లి బెంగపడుతూ వుంటుంది. వాళ్ళకంటూ ఓ దొంగ మామయ్య తప్పించి ఇంకెవరూ ఉండరు.

శ్రీధర వర్మ, రామ్మోహన్‌ అన్నాతమ్ములు(కజిన్స్). వాళ్ళ హోటల్లో చెఫ్ గా పనిచేస్తూ ఉంటుంది మహేశ్వరి. ఆమెకి శ్రీధరవర్మ తో ఒక్కa క్షణం కూడా పడదు. గొడవపడి వెళ్ళి పోతుంది. అతను వేరే చెఫ్ తో అష్టకష్టాలూ పడి చివరికి అందrరి సలహాల మెరకు తింగరిదైనా ఆమే తన హోటల్ కి సరైనా చెఫ్ అని వెతుక్కుంటూ వచ్చి ఆమె డిమాండ్స్ కి ఒప్పుకుని మళ్ళీ ఉద్యోగం లో చేర్చుకుంటాడు, కాని ఇద్దరి కి ఎప్పుడూ పడదు దెబ్బలాడుకుంటూ ఉంటారు.

ఇక్కడ ఈ అన్నా తమ్ముళ్ళకి ఓ తాతయ్య (రంగనాధ్). ఈయనకి ఫ్లాష్ బ్యాక్ లో ఓ కూతురు. ప్రేమపెళ్ళి చేసుకునiి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అతను వాళ్ళపై బెంగపెట్టుకుని ఓ డిటెక్టీవ్ తో ఆరాతీయిస్తాడు. వాళ్ళు చనిపోయారని వారికి ఓ అమ్మాయి పుట్టిందని ఆమె ఎక్కడుందో తెలియదనీ తెలుసుకుంటాడు.
ఆ బెంగ తోనే చావుబతుకుల్లో ఉన్న తాతయ్య రెండ్రోజుల కంటే ఎక్కువకాలం బ్రతకడని తెలిసి ఈ ఇద్దrరు హీరోలూ
తాత సంతృప్తి గా కన్నుమూయాలని మహేశ్వరి ని ఓ రెండు రోజులు మనవరాలిగా నటించమని దానికiి బదులుగా ఆమె అప్పులని తీరుస్తారు. ఈమే తప్పిపోయిన మనవరాలని తాతని నమ్మిస్తారు.

ఆమె రెండ్రోజులకి నటించడానికి ఒప్పుకొని వచ్చాక తాత ఆరోగ్యం బాగైపోతుంది. ఆమె ని వదిలి ఇక క్షణం కూడా ఉండలేనంటాడు. ఆమె ఇంటికెళ్ళాలని పేచీ హీరోలేమో వెళ్ళనివ్వరు. రాత్రి కాగానే రహస్యంగా బాల్కానీ లోంచి దూకి ఇంటికెళ్ళిపోయి. హోటల్ కని తనిట్లో చెప్పి వీరింటికి వచ్చి తెల్లారే సరికి గదిలో ఉంటుంది...ఇలా సాగుతూ ఉంది కథ.

వాళ్ళ ముగ్గురి మధ్య జరిగే గొడవలూ, కథ లోని సంఘటనలూ భలే నవ్విస్తూ ఉంటాయి. మహేశ్వరి నటన హైలైట్.

వీళ్ళే కాక మిగతా పాత్రలూ అప్పుడప్పుడూ చక్కిలిగిలి పెడుతూ ఉంటాయి.
ఇప్పటికైతే బాగుంది సీరియల్ తరువాత్తరువాత సాగదీసి పాడుచేయకపోతే టివి లో వచ్చిన కొన్ని చక్కని సీరియలs్స్ లో ఇదీ చేరొచ్చు.

ఈ సీరియల్ నిర్మాత సినీ హీరో సురేశ్. దర్శకుడు వాసు ఇంటూరి.

(హెచ్చరిక; టీవీ సీరియల్స్ ఏ ఎపిసోడ్ నుండైనా ఎలాగైనా మారే ప్రమాదం గలదని గ్రహించగలరు.)

షేర్ ఆటో కథ

3:39 PM at 3:39 PM

కొత్తపాళీ గారు "కథ రాయండి" అంటూ ఇచ్చిన ఇతివృత్తానికి పోటీ లో బహుమతి గెలుచుకున్నా నా మరో కథ
ఈ మాట వెబ్ పత్రికలో

సమకాలీన కొంకణీ కథానికలు

5:20 PM at 5:20 PMఎక్కడైనా పుస్తక ప్రదర్శన ఊంటే వెళ్ళి కంటికి నదురుగా కనిపించిన ఓ నాలుగు పుస్తకాలు తెచ్చేసుకోవటం, తరువాత అవి పుస్తకాల బీరువాలోకి నేను జనజీవనస్రవంతిలొకి వెళ్ళిపోవటం మామూలైపోయింది. ఎప్పటికైనా కాలంకలిసొచ్చి అన్నీ చదువుతాననే ఆశ. పుస్తకాల బీరువా సర్దినప్పుడల్లా అరే ఈ పుస్తకం ఎప్పుడు కొన్నానబ్బా అని ప్రతిసారీ ఆశ్చర్యపోతూనే ఉంటా. పంచినవి పంచగా పోయినవి పోగా పాపం ఇంకాకొన్ని మిగిలే ఉంటాయి చదివినవి, చదవనివి, చదివి మర్చిపోయినవి. అలా నా ర్యాక్ లో నాకు ఈ నెల దొరికిన పుస్తకం “ సమకాలీన కొంకణీ కథానికలు.” ఓ నెల రోజులు విందు చేసుకున్నాక దాన్ని కాస్త పంచుదామని ఈ టపా.

వేరు వేరు కొంకణీ రచయితలు రాసిన కొంకణీ కథల సంకలనం ఇది. సంపాదకుడు పుండలీక్ నారాయణ్ నాయక్. తెలుగు అనువాదం శిష్టా జగన్నాధ రావు. దీనిలో కూర్చిన పాతిక కథలూ వేరు వేరు ఇతివృత్తాలు కల్గినవి.
పుస్తకం ముందు పేజీల్లోనే దీని సంపాదకులు పుండలీక్ నారాయణ్ నాయక్ కొంకణీ బాష పోరాటం గురించీ, కొంకణీ కథా, సాహిత్యపు పురోగమనం గురించీ ప్రస్తావించారు.
అలాగే పుస్తకంలోని ప్రతి కథనీ మనకి పరిచయం చేస్తూ ఆ కథా రచయిత విశిష్టతని క్లుప్తం గా వివరించారు. దీంట్లోని రచయితల, రచనల వివరాలని పుస్తకం చివర పేజీల్లో వివరంగా పొందుపర్చారు.
గోవా ప్రజల జీవితాలలోని సంఘటనలూ, సమస్యలని ప్రతిఫలిస్తాయి ఈ కథలు.

దీంట్లో మొదటిది “ వీఠూ తాళం చెవి పోయింది”. ఈ కథ నా కైతే ఏమీ అర్ధమవ్వలేదు. వింతగా ఉంది. పాత రష్యన్‌ చిన్న పిల్లల కథ ని చదివినట్టు గా అనిపించింది. ఈ కథ గురించి సంపాదకుడు ఏం రాశాడా అని చూసాను. అ. న. మాహ్బ్రె కథ కొత్త ప్రయోగాలు చేసే ప్రయోగశీల రచయిత, అనితరసాధ్యమనిపించే మార్గం లో రాసిన ఈ కథలు అసంగతం గా తోచవచ్చు, మార్మిక మైన బాషాశైలి. అని ఉంది. మరి మళ్ళీ మళ్ళీ చదివి చూస్తా ఏమైనా అర్ధమౌతుందేమో.

చేదు అనేది జీవితంలో లేదు దాన్ని చూసే పద్దతి లోనే ఉందని గ్రహించి, ఎన్ని సాధించినా దొరకని నిశ్చింతని తన మూలాల్లో నే వెతకాలనుకుంటూ, జీవితం లోని తియ్యదనాన్ని అన్వేషిస్తూ తన గ్రామానికి వెళ్తానంటుంది కథానయకి “ దేవతా వంశి” కథ లో.

“నిక్కరు” కథలో చిరుగుల లాగు వెసుకునే డింగూకి కొత్త నిక్కరు ఆశ చూపి పనిచేయించుకుని మోసం చేస్తాడు వాడి మామ. చిన్న పిల్లల అమాయకత్వాన్ని పెద్దమనుషులు స్వార్థానికి ఎలా వాడుకుంటారు ననిపించింది. మనసుని కదిలించే కథ.

“చాకలి బండ క్రింద అంకురం” గోవాకి స్వాతంత్ర్యం లబించిన రోజుల్లోని పరిస్థితులని ప్రస్తావించినా కథలోని అసలు సందేశం జీవితం పట్ల ఆశావహదృక్పదం.

భర్త లక్ష్యాల పరుగులు, తన పై కుటుంబ భారం ప్రశ్నించే ఒంటరితనం వెరసి జీవితం లో నిరాసక్తతా బీడు లా ఉన్న హృదయం లో పన్నీటి జల్లులా ఎదిగిన కొడుకు చల్లటి నీడ ఏతల్లి కి అమృతతుల్యంగా ఉండదు! జ్యోతీ కుకళ్ కార్ కథ “నీడ” లో మనకి కనిపిస్తాడు ఆ రత్నంలాంటి కొడుకు.

ఎప్పటికైనా తప్పిపోయిన తన కొడుకుని కలుస్తాననే విశ్వాసం తో ఎదురు చూస్తున్న ముసలి తండ్రి కి ఒక అబద్దం తో అతని ఆఖరుక్షణాలలో ఆనందాన్ని కల్గజేస్తాడు ఒక పాద్రీ.. “ముడుపు” కథ లో.

“ఇంటిపెద్ద” ఓ కుటుంబానికి సంభందించింది రాస్తూనే దానిలో అప్పటి పోర్చుగీసు పాలన మరియు వారికి వ్యతిరేఖంగా పోరాడే క్షత్రియ వీరుడు రాణే ల ప్రస్తావన తో ఉంటుందీకథ.

అచ్యుత్ తోటేకార్ “ ప్రేమనగరం లో అతిధి” గోవా లోని దేవదాసీ లకు సంభందించినది ఒక్క క్షణం కలిగిన బలహీనత వల్ల తని జీవితంలో సంపాదించిన గౌరవాన్నంతా పోగొట్టుకున్నానేనని పశ్చాత్తాప పడతాడు ఇందులో పుజారి.

కేవలం కుంకుమ కోసమే తప్పించి ఉన్నాలేనట్టే ఐన వ్యసన పరుడైన, హింసించే భర్తని ఇక భరించి ఊరుకోకూడదనుకుంటుంది తాగుబోతు భర్త చేతిలో తన్నులు తింటూ మరీ అతన్ని పొషించే భార్య.
హేమానాయక్ “కుంకుమాధారం” కథలో.

రానని చెప్పిన పెళ్ళికొడుకు కోసం నిత్యం పెళ్ళికూతురులా ముస్తాబవుతూ ముసలితనం లోనూ విశ్వాసం వదకుండా అతనొస్తాడని ఎదురుచూస్తున్న అందాల పెళ్ళికూతురి దయనీయమైన విషాద కథ “ పెళ్ళికూతురు”.

ధన్యజీవి శవాల మోర్తే నిన్నటి మనిషే ఈనాటి శవం అంటూ ఎవ్వరికీ అక్కరలేని సవాలని ప్రీతి తో దహన క్రియలు చేస్తాడు “శవాల మిత్రుడు” కథలో.

పెళ్ళికి కావలసిన అర్హత ప్రెమా? లేక బ్రతుకు తెరువా? అనే పాత సందేహమే “ ప్రేమ జాతర” కథ చదివితే మళ్ళి ఒకసారి కలుగుతుంది. తప్పక ప్రేమే అన్నట్టు అనిపిస్తుంది.

తను కష్టాలలో ఉన్నప్పుడు తననొదిలి పొయింది భార్య అండగా నిలచిన ఉంపుడుగత్తే తన భార్య గా భావించి గౌరవిస్తాడు “అంగవస్రం” కథలో వాసుబాబు.

చనిపోయినవారు తిరిగి రారని తెలిసి అమని హింసించే నాన్న చనిపోవాలని దేవున్ని కోరుతాడు ఓ కుర్రవాడు “దేవుడా కాపాడు” కథలో.

“లోతైన మడుగు” కాస్త లోతైనకథలాగే ఉంది. పల్లెటూరి వాతావరణం, జీవనం ప్రతిబింబించేలా ఉంది.

“తెప్పఉత్సవం” ఉత్సవ జాతరని మజా చేద్దామనుకునే కుర్రాడి కథ బానే ఉంది కాని చివరకేదో అసంపూర్ణంగా తోచింది.

స్వార్ధపు ప్రపంచం తో గాయపడి, విసిగిపోయినా వదులుకోలేని మానవత్వపు విలువలు గల మంత్రసాని కథ “ వైరాగ్యం”.

స్వాతంత్ర్యానంతరం చట్టం లొ మార్పుల వల్ల స్వదేశం లొ కౌలు కిచ్చిన తన సష్టార్జిత మైన ఆస్తులని సొంత వారని అనుకున్న వారిదగ్గరే పోగొట్టుకుని గుప్పెడు మట్టి తొ విదేశానికి బయలు దేరిన వ్యక్తి కథ “గుప్పెడు మట్టి”

తనని పెంచి పెద్ద చేసిన తల్లి లాంటి ఆంటీ ని ఆమె కోడలు పెట్టే నరకం నుండి విముక్తురాలిని చెసేందుకు ఆ కోడలి అన్న నే పెళ్ళీ చేసుకుని వారికి గుణపాఠం నేర్పుతుంది అనిత. “అనిత” కథ లొ.

పిల్లలు లేని నిరాపురితమైన వృద్ధాప్యం లో తనకి ఎదిగిన స్వంత కొడుకున్నాడని తెలిసి ఉప్పొంగి పోతాడు సోనూబాబ్ “పున్నామి రాత్రి గుర్తు” కథ లో.
దీంట్లో ఇంకా కొన్ని కథలు కాకులశాపం, భాగ్యం, బ్యూటీఫుల్ లేడీ, కొంచం చలి కొంచం వేడి, సిండ్రెల్లా ప్రేమకథ.

మనుషుల జీవితాల్లోని కష్టసుఖాలు, స్పందన, స్వభావాలు, మానవత్వం, విలువలు ఏప్రాంతం వారైనా ఒక్క లాగే ఉంటాయి అనిపిస్తుంది అనువాద కథలని చదివి నప్పుడు.

"ఎ మాడెస్ట్ ప్రపోజల్"

2:34 PM at 2:34 PM

రెండేళ్ళకిందట చదివినా ఇప్పటికీ గుర్తొస్తే వెన్ను లోంచి వణుకొస్తుంది నాకు. ఇంత దాకా ఏ హారర్ సినిమా కూడా ననింత భయపెట్ట లేదు.
ఈ కథ చదివాక ఆ రోజంతా పిచ్చి చూపులు చూసాను, బుర్ర పనిచేయలేదు. వారం రూజులకి గానీ మామూలవలేదు,
ఎక్కడైనా జరిగే అవినీతి అర్ధమైతే ఈ కథే నాకు గుర్తొచ్చి చాలా భయమేస్తూ ఉంటుంది.(అణు బాంబు లక్కర లేదు అవినీతి చాలు దేశం సర్వ నాశన మై ముందు తరాల జీవితాలు నరకంగా మారడానికి).


వ్యంగ్య కథల్లో సందేశాత్మక ముగింపులు, సుఖాంతాలు ఉండవు. ఇదిగో ఇది ఇలా జరుగుతూవుంది. అని ఆలోచింప జేస్తాయి, జరిగే దానికి పర్యవసానం ఏమిటో చూపిస్తాయి.
ఈ కథ లో ఉన్నది వ్యంగం మాత్రమే కాదు, ఆ రచయిత ఆక్రోశం.

దేనికైనా పరిష్కారం చెపితే అది ఒక్కటే. కాని ఆలోచింపజేస్తే ఎన్నో పరిష్కారాలు.

ఇది నిప్పు తగిలితే కాలుతుంది. అని ఎన్ని ధియరీలు చెప్పినా పూర్తిగా అర్ధమవదు, కాని చెప్పకుండా కాస్త నిప్పుసెగ తగిలిస్తే, దాన్నెలా హాడిల్ చేయాలో బుర్రే మనకి చెపుతుంది. అది గొప్ప పాఠం.


ఇక కథ లోకి వచ్చే ముందు, ఫిబ్రవరి 2006 విపులలో ప్రచురిత మైన ఈ కథ గురించి వారు రాసిన మాటలే యధాతధంగా ఇవి.
నిత్య నూతనమైన మూడు శతాబ్దాల నాటి వ్యంగ్య రచన ఇది. పేదరిక నిర్మూలనకు పాలకుల దోపిడితనం పై ఎక్కు పెట్టిన అతి తీవ్ర వ్యంగ్య శరమిది.

మూడు వందల యాభై సంవ్త్సరాల క్రితమే పాలకులకు చురకలు అంటించడం తో పాటు ఒళ్ళూ గగుర్పొడిచేటంతటి వ్యంగ్య ప్రతిపాదనలతో సంచలనం సృష్టించిన ఈ రచన విపుల పాఠకుల కోసం ప్రత్యేకం.
అనువాదం:పినాకి.
ఇది రచయిత గురించి.
సుప్రసి్ద్ధ వ్యంగ రచయిత జోనాథన్‌ స్విప్ట్ (1667-1745) ఐర్లాండ్ లో జన్మించాడు తల్లి దండ్రులు ఇంగ్లీష్ వాళ్ళూ. ఆ నాటి సామాజిక అసమానతలను, పరిపాలకుల స్వార్ధరాజకీయాలను నిరసిస్తూ అనేక రచనలు చేసాడు. ఈయన మాస్టర్ పీస్ " గలీవర్స్ ట్రావెల్స్" నుపిల్లల పుస్తకంగా పరిగనించటం ఆనాటి సాహిత్యకారు లు చేసిన తప్పi.ిదం

పదహారవ శతాబ్ది లోనే ఇంగ్లీష్ వాళ్ళూ ఐర్లాండ్ ను దోచుకోవటం ప్రారంభించారు. పన్నుల భారం తో నిరుపేదలు అల్లల్లాడి పోయారు . దీనికి తోడు క్షామం. ప్రజలకష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ఇంగ్లీష్ వాళ్ళ దురాశను కళ్ళార చూసిన స్విఫ్ట్1720 లో "ఎ మాడెస్ట్ ప్రపోజల్" అనబడే కరపత్రాన్ని ప్రచురించాడు. 'ప్రతిపాదన' చేసింది ఒక "ఆర్ధిక శాస్త్రజ్ఞ్డు డు." ఈ సలహా అమలు పరిస్తే ఐరిష్ ప్రజలు, ముఖ్యంగా పేదలు సుఖ సంతోషా లతో, 'ఆరోగ్యంగా' ఉంటారు.


కథ లోకొస్తే.. దీంట్లో సంభాషనలూ అంటూ ఏమీ వుండవు ఒక వ్యాసం లా అప్పుడు అక్కడి ప్రజలకి రచయిత చేసిన ఒక వ్యంగ్య ప్రతిపాదన ఈ కథ.
పిల్లల్ని పోషించ లేని తల్లిదండ్రులు, బానిసలు, మష్టివారు మొదలైన నిరుపేదలకోసం. శిశువు ఏడాది దాటగానే తల్లి దండ్రుల మీద సమాజం మీద ఆధార పడకుండా, దేశ శ్రేయస్సు కు ఎలా తోడ్పడ గలదో, ఆశిశువుతో ఎలా ఎలా, ఏంమేం చేయవచ్చో అతి భయం కరమైన వ్యం్గ్యం తో సాగిన కథ.
ఇంతకు మించి దాని గురించి నేను రాయలేక పోతున్నాను, నా వల్ల కాదు కూడా అది రాయడం. ఎవరైనా ఇదివరకే ఈకథ చదివుండకపోతే ఆ ఫొటో కాపీ కావాలంటే జతచేస్తాను.

శ్రీ రామదాసు

5:20 PM at 5:20 PM

ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా టీవీ లో శ్రీరామదాసు మళ్ళీ చూసాను ఇది రిలీజ్ అయినప్పుడు ఒకసారి చూసా, అప్పుడే రిలీజ్ ఐన సినిమా పై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో వెళతాం రెండో సారైతే ఊరికే సరదాగా చూస్తాం కనుక తప్పకుండా మనకు కలిగే ఫీలింగ్ లో తేడా ఉంటుంది. అప్పుడైతే నాకు చాలా చాలా ఇష్టమైన రామదాసు కీర్తనల కోసం,ఇంకా రామ దాసు కథ ని మహా మహు లు ఎలా చిత్రీకరించారో నన్న కుతూహలం తోటీ చూశాను.రాఘవేధ్రరావు తనదైన ముద్రతో చిత్రాన్ని రంగులతో ముంచెత్తాడు!
"శ్రీరామ నామం మరువం మరువం" అనే పాటతో టైటిల్స్ మొదలై ఆ కథ కి సంభందించిన వాతావరణం లోకి అడుగు పెట్టించేసారు.

అన్నమయ్య సినిమాలోలాగే దీంట్లో నూ కాస్త మసాలా చిలకరించారు. నేపధ్యం లో అందమైన దృష్యాలు, సెట్టింగ్ లు ,అందరి కలర్ ఫుల్ కాస్ట్యూంస్ మొదలైనవి చిత్రానికి చిక్కదనాన్ని ఇచ్చాయి.


నాగార్జున ఎప్పటిలాగే అలవోకగా నటించేసాడు కరుణ రసాన్నిచక్కగా పండిచాడు., స్నేహ కమలగా పాత్ర లో ఒదిగి పోయింది.కాష్ట్యూమ్‌ నగల తో బాపూ బొమ్మలా ఉంది,నటనaలోసౌమ్యతవెల్లiి విరిసింది.

గోపన్న ఎలా ఉండే వాడో తెలియదు గానీ దీంట్లో రాఘవేంధ్ర చేతిలో చాలా రోమాంటిక్, ఎనర్జిటిక్ హీరో గా కనిపించాడు.

చిన్నప్పుడు వినీ వినీ పాడుకున్న వే ఐనా పాటలు కొత్తగా అనిపించాయి,ఇప్పుడే మొదటి సారి వినేవారికి అద్భుతంగా ఉంటాయి. నా కైతే ఆ పాత కీర్తనలే ఇంకాస్త ఎక్కువ నచ్చుతాయి.తానీషా గా నాజర్ హుందాగానే కనిపించాడు. మటె సాబ్ పాత్ర కాస్త చిల్లర గా ఉంది.


ఇంకా అప్పుటి రాజకీయ సామాజిక పరిస్తితులు కూడా చేర్చి చూపితే బాగుండనిపించింది.
పాపికొండలు, గోదావరి అందాలu,పచ్చటి పరిసరాలు సినిమాకి అందాన్నీ,చూసేవారికి ఆహ్లాదాన్ని అందించాయి."అంతా రామ మయం "పాట లోనైతే ప్రకృతి ఇంకా అ్ద్భుతంగా వినిపించి కనిపించింది.

కౌలు కూడా కట్టలేని ప్రజల జీవితాలను బాగుపర్చిన అధికారి గా గోపన్న కనిపిస్తాడు.

మరి రాఘవేంధ్రుని సృష్టో నిజమో తెలియదు కానీ(నేనైతే ఇదివరకెక్కడా చదవలేదు) రామ భక్తుడైన కభీర్ మనవడి గా ఒక కభీర్ (నాగేశ్వర రావు) ఇందులో కనిపిస్తాడు.

ఇక కథేంటంటే.. గోపన్న మేనమావ ల సహాయం తో గోల్కొండ నవాబైన తానీషా దగ్గర కొలువు లో చేరి,పెళ్ళి చేసుకుని హస్నాబాద్ తహసిల్ దార్ గా వెళతాడు. అక్కడ పాత తహసిల్ దార్ పాలనలోని ప్రజలు పడ్డ కష్టాలని తీరుస్తూ ఉంటాడు. అక్కడి గూడెం లోని రామభక్తురాలైన దమ్మక్క చూపించిన రాముని విగ్రహాలు మరియూ ఆనవాళ్ళు చూసి రామ భక్తుడైపోయి రాముడు నడచిన ఆప్రదేశం లో రామునికి గుడి కట్టాలనుకుం టాడు. తను కూడా ఇల్లు విడచి అడవిలోనే ఉంటూ ప్రజల వద్ద చందాలు పోగెసి లక్ష వరహాలని పన్ను గా గోల్కొండ నవాబుకి పంపుతూ మిగతా ఆరు లక్షలతో ఆలయ నిర్మాణానికి అనుమతి కై కోరతాడు. దాన్ని పాత తహసిల్దారు నవాబుకి చేరనివ్వకుండా గోపన్నని ద్రోహి గా చూపాలనుకుంటాడు.


అంతలోకి కభీర్ మనవడైన కభీర్ వచ్చి గోపన్నకి శ్రీ రామతారక మంత్రాన్ని ఉపదేశించి, మందిర నిర్మాణం ఎందుకు చేయలేదని అడుగుతాడు. ప్రభువు అనుమతి ఇంకా రాలేదని అంటాడు గోపన్న. అసలైన రాముడి అనుమతే లభించాక ఇక ప్రభువుల అనుమతి అక్కరలేదని చెప్పి శ్రీరామపట్టాభిషేకానికి ఆ వషిస్టుడే పెట్టిన ముహుర్తానికి ఆలయ నిర్మాణం మొదలు పెట్టమని చెపుతాడు. అలా ఆలయ నిర్మాణం పూర్తవుతుంది గోపన్న శ్రీరామదాసు గా పిలవ బడతాడు.
సర్కారు అనుమతి లేకుండా ఆ పైకం వాడాడని తానీషా రామ దాసుని బంధించి హింసిస్తాడు. రామదాసు శ్రీరామునికై ప్రార్ధిస్తూ ఉంటాడు. తానీషా కి శ్రీరాముడు కలలో కనిపించి తన భక్తుడైన రామదాసుని వదిలేయమనీ ఆ పైకం తనిస్తాననీ చెపుతాడు.తానీషా మేలుకుని చూసేసరికి రాముని కాలం లోని రామమాడలు కనిపిస్తాయి, అప్పుడు తానీషా రామదాసు తో తనని మన్నించమని, అగ్రహారాలూ, బహుమతులూ ఇస్తూ తిరిగి తహసిల్ దార్ గా ఉండమనీ కోరతాడు. కానీ రామదాసు ఒప్పుకోడు తనకు ఎందుకు శ్రీరాముడు కనిపించలేదని బాధ పడుతూ "ధాశరధీ కరుణా పయోనిధీ..." అని పాడుతూ ప్రశ్నిస్తూ శ్రీరాముని దర్శించని జీవితం వద్దనుకుంటాడు. చివరకి శ్రీరాముడు దర్శనమిచ్చి కథ సుఖాంతం చేస్తాడు.

మొత్తానికి చాలా రోజుల తరువాత టీవీ ముందు కూర్చుని పూర్తి గా సినిమా చూసాను.తేనెగూడు

4:15 PM at 4:15 PM

మా ఇంట్లో బైట ఆ మూలన ఈ తేనెపట్టు పెట్టాయి.

మామూలుగా ఇవి చెట్ల చిటారు కొమ్మల్లో ఉంటాయి కాని ఇది జనవాసాల మధ్య మా ఇంట్లో ఏ సీ వెనక మూలన పెట్టాయి.

దీన్ని తీసేసే్యాలంటే మంట పెట్టాలట. పాపం కొన్ని చనిపోతాయని బాధ, కాని అవి కుడుతాయి ఇరుగు పొరుగు ఊరుకోరు అందుకే తీయించాలి, కాని అవి చావకుండా తీసేందుకు వీలౌతుందేమో నని చూస్తున్నా.

maa cine awards 2008

2:23 PM at 2:23 PMశనివారం మా టీవీ వారి సినీ మా అవార్డ్స్ 2008 చాలా రోజులనుండీ ప్రకటన చూస్తున్నా. ఇవి చూసేయాల్సిందే నని శనివారం సాయంత్రం ఎక్కడికీ వెళ్ళకుండా ఏడు గంటలకే టీవీ మందు తయారయిపోయా! కెమరానీ పక్కన పెట్టుకుని కూర్చున్నా వీలైతే బ్లాగ్ లో ఫొటోలు పెట్టొచ్చని.
వ్యూయర్స్ ఒపీనియన్‌ పోల్ నిర్వహించి ప్రజలే న్యాయ నిర్ణేతలు గా అవార్డ్స్ ప్రకటించారట.


సాయంత్రం 7 గంటలకి టీవీ లో ప్రత్యక్షప్రసారం మొదలైంది. సుమ, అలీ (యాంకర్స్) దాన్ని నడిపించారు.
మధ్య మధ్య ప్రేమ్‌రక్షిత్, నికిత, శ్రద్దాఆర్య, యువ టీం.. డ్యాన్స్ లు,రేలారే పాటలకి ఉదయభాను స్టెప్పులు, దేవిశ్రీ, పాప్ సిగర్ ఆయేశా ఆటపాటా, పాడాలనిఉంది పైనలిస్ట్ చిన్నారులు పాడిన పాటలు.. అలరించాయి, ఎప్పటిలాగే బోల్డు వాణిజ్యప్రకటనలు విసిగించాయి.


ఇక అవార్డ్స్ విషయానికొస్తే..
బెస్ట్ ఎడిటర్---వర్మ-----చిరుత.
బెస్ట్ ఆర్ట్ డైరెక్టెర్ ---ఆనంద్ సాయి-----యమదొంగ.
బెస్ట్ యాక్షన్‌ డైరెక్టర్(ఫైట్ మాస్టర్)---విజయన్‌-----చిరుత.
బెస్ట్ సినిమాటోగ్రాఫర్---సెంధిల్ కుమార్-----యమదొంగ.
బెస్ట్ డైలాగ్ రైటర్---రత్నం-----యమదొంగ.
బెస్ట్ లిరిసిస్ట్ ---వనమాలి ------హ్యాపీడేస్(అరెరే).
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్----గీతామాధురి-----చిరుత.
బెస్ట్ స్టోరీ రైటర్---శేఖర్ కమ్ముల -----హ్యాపీడేస్.
బెస్ట్ కమేడియన్‌----బ్రహ్మానందం-----ఢీ.
బెస్ట్ విలన్‌----కెల్లీ డార్జీ------డాన్‌.
బెస్ట్ కొరియో గ్రాఫర్---ప్రేమ్‌ రక్షిత్-----యమదొంగ.
బెస్ట్ మ్యూసిక్ డైరెక్టర్---- మిక్కి జె.మేయన్‌-----హ్యాపిడేస్.
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్----శ్రీవాస్ ----- లక్ష్యం.
బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌--- హన్సిక----- దేశముదురు.
బెస్ట్ రిఫ్రెషింగ్ స్టార్ ---రామ్‌ చరణ్ తేజ్ -----చిరుత.
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్‌ ప్రామినెంట్ రోల్--- సుహాసిని------శ్రీ మహాలక్ష్మి.
బెస్ట్ యాక్టర్ ఇన్‌ ప్రామినెంట్ రోల్---మోహన్‌ బాబు------యమదొంగ.
బెస్ట్ మూవీ --------- హ్యాపీడేస్.
బెస్ట్ డైరెక్తర్--- శేఖర్ కమ్ముల -----హ్యాపీడేస్.
బెస్ట్ హీరోయిన్‌----త్రిషా------ ఆడవారి మాటలకు అర్ధాలేవేరులే.మధ్య మధ్య కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు.... కే.విశ్వనాధ్ కి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్, బ్రహ్మానందం కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిన సందర్భంగా సన్మానం జరిగాయి..


దీంట్లో ఇంకో ముఖ్య కార్యక్రమం మా టీవీ వారి కొత్త లోగో విడుదల. మా టీవీ సి.ఇ.ఒ.శరత్ ప్రకటించాక,
మా టీవీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ ---- మురళీ కృష్ణం రాజు, మ్యాట్రిక్స్ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున, అల్లూఅరవింద్, చలసాని రమేష్, వెంకటేశ్ రాజు. కొత్త లోగో ని ఆవిష్కరించారుసరె అన్నీ వచ్చాయ్ మరి బెస్ట్ హీరో అవార్డ్ గురించి రాయలేదేమా ననుకుంటున్న్నారా! ఆ విషయానికే వస్తున్నా...
ఊరించి..ఊరించి... రాత్రి 1.30 తరువాత ఇక బెస్ట్ హీరో అవార్డ్ అన్నారు... అంతే ఇంకేమీ రాలేదు.. ఆ ప్రోగ్రాం ఆపేసి ఓగంట సేపు యాడ్స్ వాయించి..తరువాత ఏదో పాత ఎపిసోడ్ రికార్డ్ వేసారు!
అవార్డ్ ప్రోగ్రాం ఎందుకు నిలిపేసారో కనీసం ప్రకటన కూడా ఇవ్వలేదు!
చూసీ, చూసీ ఇక ఇంతే అని అర్ధమై, ఒళ్ళు మండి బంగారం లాంటి నిద్రపాడైయిందని ఏడ్చుకుంటూ లేచా!
మొత్తనికి చివరాఖరికి పూర్తిగా చూపకుండానే తలుపులేసుకున్నారు.
..........


ఇప్పుడే అందిన వార్త బెస్ట్ హీరో ఎన్‌ టీ యార్---- యమదొంగ...

గూడు

2:16 PM at 2:16 PM
ఈ రోజు ఉదయాన్నే మల్లె తీగ ఆకులపై నేను దీన్ని చూసాను.


ఏదో పురుగు చిన్న చిన్న పుల్లల్ని గుండ్రంగా అతికించి గూడుగా చేసుకుంది. ఆకుకి వేలాడుతూ కనిపించింది.


అంతచిన్న పురుగు తన కన్నాపెద్ద సైజు పుల్లల్ని తెచ్చి అలా గాలిలో ఆకుకి వేలాడ దీయటం నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. వెంటనే క్లిక్ మనిపించాను.

తెల్ల కాగితం

11:11 PM at 11:11 PM


వీధి గుమ్మంలో నించుని వీధి లోకి చూస్తూన్నాను. పక్కింటి గుమ్మం లోంచి లోపలికి తొంగి చూసాను. రమణ పని నుండి ఇంకా రాలేదు. దూరంగా కృష్ణా గాడి గొర్రెలు, వాటి వెనకే కృష్ణ కనిపించారు. వీడి గొర్రెలు వచ్చే టైం అయ్యిందంటే ఈ సరికే రమణ వచ్చుండాలి, ఇంకా రాలేదంటే పొరుగూరి పనికి వెళ్ళుంటాడు ఇక రాడు.
శీను గాడి కొత్త నోటు పుస్తకం గురించి రమణ తో చెప్పాలని ఆత్రంగా ఉంది.
ఇంటి ముందు నుండి కృష్ణ గాడు వెళుతున్నాడు పోని వీడికి చెప్పనా! వీడికేమీ తెలియదు, చెప్పినా పట్టించుకోడు!
వాడు గొర్రెల తో బాటు మాఇంటిని దాటి వెళ్ళి పోయాడు.

ఉదయం బడి లో చూసిన శీను గాడి నోటు పుస్తకమే పదే పదే గుర్తొస్తూ ఉంది. ఎంత బావుందో అందమైన అట్ట ఒక్క సారి చూపించి దాచుకున్నాడు. సిటీ నుండి మా బాబాయ్ నాకోసం తెచ్చాడు కొత్త పేజీలు ఎంత మంచి వాసనో అంటూ ఊరించి చెప్పి, నాకూ ఇవ్వరా నేనూ చూస్తానని ఎంత అడిగినా ఇవ్వనేలేదు.

"శివా రారా" ఇంట్లోంచి అమ్మ గొంతు. గంజి తాగ టానికి పిలుస్తుంది. మళ్ళీ ఒక సారి వీధి చివరిదాకా చూసాను. సాయంత్రం వేళ దాటి మెల్లిగా చీకటి కమ్ముతూఉంది.
లోపలికి వెళ్ళాను. కూలిపోవటానికి సిద్దంగా ఉన్న వసారా బయట పొయ్యి ముందు ఉన్న అమ్మ ప్రక్కనెళ్ళి కూర్చున్నా
కమ్మటి గంజి వాసనకి పొట్టలో ఆకలి మొదలైంది, గబ గబా గంజి తాగేసి నాన్న కోసం గుమ్మం దగ్గరెళ్ళి నిలుచున్నా. దూరంగా వీధి మొదట్లో నాన్న కనిపించగానే పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి కబుర్లు మొదలెట్టాను.
నాన్నా మా తరగతి లో ఈసారీ కూడా పరిక్ష లో నేనే ఫస్ట్ వచ్చా, ఈ రోజు నేను వేసిన బొమ్మ చూసి మాస్టారు నన్ను వెరీ గుడ్ అన్నాడు." చెపుతూ నాన్న తో కలిసి ఇంట్లో కి వచ్చాను.
నాన్న అమ్మ ఇచ్చిన నీళ్ళు తాగుతూ వసారా లో గోడ కి ఒరిగి కూర్చున్నాడు.
"నాన్నా శీను గాడు ఈ రోజు కొత్త నోటు పుస్తకం తెచ్చు కున్నాడు నాకు కొంటానని ఎప్పుడూ చెపుతావు ఇప్పటి దాకా కొననే లేదు."
"వరస గా కరువే కదరా! ఒక్కో సారి ఒక్కో కారణం తో పంటలే లేవు, ఈసారి పరవా లేదు. పంట డబ్బు రాగానే కొంటాలేరా. రైతు నై ఉండీ పంటలు లేక కూలికెళదామన్నా కూలి కూడా దొరకని రోజులొచ్చాయి! ఈ చిన్న రైతు బతుకు నీకు మాత్రం ఒద్దురా, నువ్వు బాగా చదివి ఉద్యోగం చేయాలి." అన్నాడు నాన్న.

"ఓ అలాగే నాన్నా నేను బాగా చదువుతాగా, మా లెక్కల మాస్టారు రోజూ అంటాడు నేను గొప్పవాన్నౌతానంట."
తరువాత చాలా సేపు అమ్మ తో ఈ సారి పంట గురించి, ధరలు, వ్యవసాయం గురించి మాట్లాడు తూనే ఉన్నాడు నేను చిన్నప్పటి నుండీ వింటున్నవే! వారి మాటలు వింటుంటే ఎప్పుడో నిద్ర పట్టేసింది.

తెల్ల వారి లేచి చూస్తే నాన్న లేడు చీకటి తోనే పొలాని కెళ్ళాడు. ఈసారి వాతావరణం బాగుంది, పంట బాగానే వచ్చేటట్టుంది, దీంతో పాత అప్పులన్నీ తీరితే చాలు అంటూ అస్తమానం పొలం దగ్గరే గడుపుతున్నాడు.
బడి కెళ్ళ డానికి తయారై పోయి "అమ్మా బడి కెళుతున్నా" అమ్మ వైపు చూస్తూ చెప్పా తలూపింది. అంటే ఇంక తినటానికేమీ లేనట్టే! పుస్తకాలు తీసుకుని బయటకొచ్చి రమణ వచ్చాడేమో నని ఓ సారి వాళ్ళింట్లోకి తొంగి చూసా వాడు లేడు.
బడి కేసి నడవ సాగాను శీను గాడి కొత్త నోటు పుస్తకం గుర్తొచ్చింది అలాంటి తెల్లటి కాగితాల పై రాసుకోవాలని నా కెప్ప టి నుండో ఆశ. ఇప్పటి దాకా కొత్త తెల్లకాగితం పై ఎప్పుడూ రాయలేదు. అక్కడా ఇక్కడ అడిగి తెచ్చిన పాత కాగితాలు, పోస్టర్ లు, ఓ వైపు ఖాళీ గా ఉన్న కరపత్రాలు, లాంటి వాటినన్నింటినీ పుస్తకం లా కుట్టి ఇస్తాడు నాన్న.
అసలు మా బడిలో చాలా మందికీ ఇంతే కొత్త పుస్తకాలు ఉండవు ఎక్కువ మంది మధ్యాహ్నం బడి లో పెట్టే అన్నం కొరకే బడి కి వచ్చేది. ఐదో తరగతి వరకూ వస్తారు, ఆతరువాత ఎవరూ చదవరు. ఆ తరువాత బడి లో అన్నం పెట్టరు గా అందువల్ల! ఐదు తరువాత పెద్ద బడి కెళ్ళ కుండా ఏదో ఓ పనికి వెళతారు.
రమణ పోయినేడాది వరకు తనతో బడి కి వచ్చేవాడు ఈ సంవత్సరం వాడు ఆరో తరగతి లోకి వెళ్ళాలి కాని చదువు మానిపించి వాళ్ల బావ దగ్గరికి కొయ్య పని లోకి పంపించాడు వాడి నాన్న. వచ్చే సంవత్సరం నేను ఆరు లోకి వెళతాను నాన్నైతే తనని మానిపించనని చదివిస్తాననే అంటున్నాడు.
ఆలోచించుకుంటూ బడి కి వచ్చేసా. సీను గాడి కోసం చూసాను వాడు కనిపించ లేదు. గది లో వెళ్లి కూర్చున్నా.
ప్రక్కన రాజు గాడు వాడి దగ్గరున్న నిన్న మాష్టారు వదిలేసి పోయిన చాక్ పీస్ ముక్కలు అందరితో ఎలా పోట్లాడి గెలుచుకున్నాడో చెపుతూ చూపిస్తున్నాడు.
"సరేలేరా " అని శీను రాలేదేమా నని చూస్తున్నా.
మొదటి పిరియడ్ మొదలైయ్యాక వాడు వచ్చాడు. మాష్టారు పాఠం చెప్పేసి "నేను చెప్పిందంతా చదవండి రా." అని తనతో తెచ్చిన పేపర్ చదుకుంటున్నారు.
తరగతి అంతా గోల గా ఉంది అందరూ ఇప్పటి నుండే అన్నం బెల్లు కొరకు ఎదురుచూస్తున్నారు.

"అరేయ్ మీరంతా అన్నం బెల్లు కి ముందు ఆకలికి, తరువాత నిద్ర కి జోగుతార్రా!" అని రోజూ అన్నట్లే అని తెలుగు మాష్టారు వెళ్లి పోయారు.

మెల్లి గా మరో రెండు పిరియడ్ లు గడచాయి.
అన్నం బెల్లు కాగానే అందరం వరస గా వెళ్ళి అన్నం తెచ్చుకుని మాట్లాడు కుంటూ తినసాగేం. ఈ సారి నాకు తప్పక కొత్త నోటు పుస్తకం కొంటానన్నాడు రా మానాన్న! అందరి తో చెప్పాను.

"అట్ట మాత్రం చాలా అందంగా ఉండాలని చెప్పరా." చెప్పాడు శీను.

"వీడిలా గీతల కాయితాలు ఉండొద్దు రా పూర్తి గా తెల్లది కొనుక్కో ."అన్నాడు రాజు గాడు.
తరువాత అందరం తరగతి గది లోకి వెళ్ళాం. ఇప్పుడు సుబ్బారావ్ మాష్టారు రావాలి కాని ఆ మాష్టారు ఎప్పుడూ సెలవు లోనే ఉంటుంటాడు కాబట్టి ఇది మాకు ఆట ల పిరియడ్ లాంటిది.
గదంతా గోల గోల గా ఉంది,అందరం శీను గాడి చుట్టూ చేరి వాడి నోటు పుస్తకం గురించి వాడు చెప్పేవన్నీ విన్నాం. ఈ పిరియడ్ చాలా తొందరగా అయినట్టు అనిపిస్తుంది రోజూ.

తరువాత గణితం మాష్టారు వచ్చారు.
శివా నిన్న నేను చెప్పింది బోర్డు పైని రాయరా." అని నాకు చాక్ పీస్ ఇచ్చారు. నేను రాసిన లెక్క చూసి "అరేయ్ నువ్వు మాత్రం చదువు మానేయకురా నీకు మంచి భవిష్యత్తుంది." అన్నారు ఎప్పటి లాగే.

చివరి పిరియడ్ సాంఘీక శాస్త్రం మాష్టారు పటాలు తెచ్చి భారతదేశ పటం పాఠం చెపుతున్నారు. అందరి చూపూ గుమ్మం వేపే ఉంది. వరండాలో మా తరగతిగది చివరగా ఉంటుంది. దీన్ని దాటి వరండా చివర కెళితే అక్కడ బెల్లు ఉంటుంది.
ఈ చివరి పిరియడ్ లో రహీం మాతరగతి ముందు నుండి వెళ్ళాడంటే బెల్లు అయినట్టే. రహీం నిచూడగానే అరచుకుంటూ బయటకి పరుగు పెట్టేస్తారు అంతా.

రహీం ని చూడ గానే మాష్టారు పాఠం చెప్పడం ఆపేసారు. అంతా తోసుకుంటూ వెళుతున్నారు.
"శివా నువ్వుండరా, ఈ మ్యాపులు తీసుకుని నాతో రా." అన్నారు మాష్టారు. ఆ పటాలు పట్టుకుని మాష్టారుతో ఆఫీసు గది కి వెళ్ళి టేబుల్ పై పెట్టి బయటకి వస్తుంటే గుమ్మం పక్కన తెల్లటి మబ్బుముక్కలా పడుంది ఓ తెల్ల కాగితం. అన్నం బెల్లప్పుడు వచ్చిన ఆ గవర్నమెంట్ సార్లు పడేసుకున్నారేమో పాపం!
వంగి దాన్ని చేతిలోకి తీసుకున్నా. అబ్బా ఎంత బావుందో పూర్తిగా తెల్లది, కొత్త కాగితం! వెనిక్కి తిరిగి చూసా మాష్టారు పటాలు సర్దుకుంటుంన్నారు.
"ఇది ఇక్కడ పడుంది నేను తీసుకోనా మాష్టారు.. " అడిగా. నావైపు తిరిగి చూసి "ఊ తీసుకో" అన్నారు.

దాన్ని భద్రంగా పట్టు కుని ఇంటికి బయల్దేరాను. స్కూల్ ఓ పక్కన పడి పోయిందని ఇంకో మంచి గదులు కట్టించ మని పెద్ద మాష్టారు గవర్నమెంట్ కి రాసారంట ఈ రోజు వాళ్ళొచ్చి చూసెళ్ళారు.
రాజు గాడి ఇంటి దగ్గర కొచ్చాను వాడు బైటే నిలుచుని ఉన్నాడు,
"ఆటకి రావారా." నన్ను చూసి అరచాడు. ఉహూ రాను చెప్పి మా వీధి మలుపు తిరిగాను. మన కేమైనా సమస్య వస్తే గవర్న మెంట్ కి రాస్తే వారొచ్చి తీరుస్తారట! గవర్న మెంట్ గురించి మాష్టారు చెప్పే వన్నీ గుర్తు తెచ్చు కుంటూ ఇంటికొచ్చాను.

పూర్తి తెల్ల కాగితం, కొత్త ది నాదే అనుకుంటే సంతోషతో ఉప్పొంగి పోతున్నా.., శీను గాడి నోటు పుస్తకం సంగతి పూర్తి గా మర్చి పోయాను.
వీధి లోకి వచ్చి ఎవరైనా కనిపిస్తారేమోనని చూస్తున్నా, రమణ వస్తున్నాడు. వాడికీ ఎంతో ఇష్టం చదుకోవటం. పనికి వెళితే వాడికి డబ్బులేమీ ఇవ్వరంట వాడి బావ దగ్గర నలుగురు పనివాళ్లున్నారు వారిదగ్గర చిన్న చిన్న పనులు వీడు చేయాలట. ఆ కొయ్య పని నేర్చుకుని పెద్దయ్యాక బాగా చేస్తే అప్పుడు డబ్బు లిస్తారంట. అప్పుడు ఒకే సారి అన్ని పుస్త కాలూ కొనుక్కుంటారా అంటాడు వాడు.
అమ్మంటుంది మన పరిస్తితులకి రోజూ అన్నం పెట్టి, సంవత్సరానికి ఓ లాగూ, చొక్కా ఇచ్చి పని నేర్పుతున్నారంటే అది వాడి అదృష్టమేనంట.
"నిన్నంతా రాలేదారా?" వాడు దగ్గరికి రాగానే అడిగాను.
"లేదురా. రేపటి నుండీ ఇక్కడుండను, సిటీ లో బావ కి పెద్ద పని కుదిరింది. రెండు నెలలు అక్కడే ఉండి పని పూర్తి చేయాలి. బావ దగ్గర పనిచేసే వాళ్ళ అక్కడే ఉన్నారు బావ వాళ్ళ ఇంటికొస్తూ నన్నూ తీసుకొచ్చాడు ఇప్పుడే వస్తున్నా మళ్ళీ రేపెళ్ళిపోవాలి."
వాడికి నా తెల్లకాగితం గురించి చెబుతూ ఇంట్లోకి తీసుకొచ్చి చూపించాను.
"బావుంది. ఏమ్రాస్తావు రా దీనిపైని ? బొమ్మ వెయ్యిరా నువ్వు బొమ్మలు బాగా వేస్తావు" అన్నాడు.

వాడెళ్ళాక ఆలోచించడం మొదలెట్టా ఏం రాయను దీని పైనని. తెల్ల గా ఉన్న దాన్ని చూస్తే ఎంతో ఆనందంగా గొప్పగా ఉంది. ఏదైనా రాయడం నచ్చలేదు. నాజీవితం లో మెదటి సారి నా సొంత తెల్ల కాగితం ఇది. దాన్ని భద్రంగా పుస్తకాల మధ్య దాచాను. ఇక అప్పటి నుండీ అది నాప్రాణమై పోయింది. అదే నా పెన్నిధి.
బడిలో బైటా అందరికీ చూపించి దాచుకున్నా. నాన్న కొత్త నోటు పుస్తకం కొనిచ్చాక దీనిపై ఏదైనా రాసుకోవాలి అనుకున్నా, కాని ఒద్దనిపించింది. దీన్నిలాగే దాచుకుని ఆ పుస్తకం లో రాసుకుంటా అనుకుని దాని కోసం ఎదురు చూడ సాగాను.

****

సిటీ నుండి రమణ ఇంకా రాలేదు. నేను ఎప్ప టి లాగే బడి కెళుతూనేఉన్నా.
గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకున్నారట ఓ కాంట్రాక్టర్ వచ్చాడు బడి లో రెండు కొత్త గదులు కడుతున్నారు.
నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సారి అన్నీ కలిసొచ్చాయి వాతావరణం బాగుంది, ఈపంట చూస్తుంటే పాత అప్పులన్నీ తీరిపోయి కొంత డబ్బు మిగులుతుంది అని రోజు కొక్క సారైనా అంటున్నాడు.
నా తెల్ల కాగితం నాప్రాణ మై పోయింది రోజూ లేవ గానే తిరిగి పడుకునే ముందు దాన్ని చూసుకోవాల్సిందే.

"నాన్నా కాగితం చెట్టు నుండే వస్తుందని మాష్టారు చెప్పారు మన పొలం లో ఆ చెట్లేసి మనం బోల్డు కాగితం తయారు చేసుకుందామా."
"అవి తయారవ డానికి మిషిన్లు కావాలి కదరా. చెట్లని మనం పెంచి అమ్మినా కాగితాలని కొట్టు కెళ్ళి డబ్బు లిచ్చి కొనుక్కోవాలి. సూరి మామ పత్తి పండించినా బట్ట లు కొనుక్కోవల్సిందే కదా అలాగన్న మాట." చెప్పాడు నాన్న.
సూరి మామ పత్తి వేసినా వాళ్ళు పాత బట్టలే వేసుకుంటారు. పత్తి నుండే బట్ట లొస్తాయని మాష్టారు చెప్పి నప్పుడు , నాకైతే చాలా పత్తి పంటేసి చాలా చాలా గుడ్డ తయారు చేస్తే అందరూ చిరుగుల్లేని కొత్త బట్టలు వేసుకోవచ్చు కదా! అని పిస్తుంది. కాని అందరూ ఈ సారి ఎక్కువ పండిచేసారు కాబట్టే పంట ధర చాలా తక్కువ పలికింది అన్నాడు మామ. అలాగైతే మరి కొట్టు లో బట్టలు కూడా తక్కు వధర ఉండాలి గా! నాకు అస్సలు అర్ధం కాలేదు.

****

ఈ రోజు నాన్న పంట అమ్మి డబ్బు తేవడానికి టౌన్‌ మార్కెట్ కెళ్ళాడు.
బడి నుండి వచ్చి నాన్న కోసం ఎదురుచూస్తూ ఉన్నా. చీకటి పడి పోయింది. పక్కింటి మామ వస్తున్నాడు మా ఇంటి దగ్గరికి రాగానే ఆగి మీనాన్న రాత్రికి రానని చెప్పాడు రా, పంట ధర పలక లేదు రేపటి దాకా చూసి రేపొస్తానని చెప్పమన్నాడు. మీ అమ్మకి చెప్పు అంటూ వాళ్ళింట్లోకి వెళ్ళాడు.
ఇంట్లో కి వచ్చి అమ్మ తో చెప్పి నాన్న తెచ్చే వాటి గురించి ఆలోచిస్తూ నిద్ర పోయాను.

తెల్ల వారి బడి కెళ్ళినా నా మనసంతా ఇంటి మీదే ఉంది నాన్న వచ్చాడేమో కొత్త నోటు పుస్తకంతెచ్చే ఉంటాడు అనుకుంటూ వున్నా.
బడి నుండి వచ్చే సరికి ఇంకా నాన్న రాలేదు అమ్మ ఏడుస్తూ కనిపించింది. పక్కింటి అత్త కూడా కళ్ళు తుడుచుకుంటూ అమ్మ పక్కనే కూచునుంది.
మన పంట ని కొనే వాళ్ళు మరీ అన్యాయ మైన ధర చెబుతున్నారంట, ఇంకా ఏవేవో మాట్లాడు కుంటుంన్నారు. అక్కడే కూచుని వాళ్ళ మాటలు వింటూ అనుకున్నా.. కొట్టు లో మనమేమయినా కొనుక్కుంటే ధర కొట్టు వాడే చెబుతాడు కదా! మరి మనంపంట అమ్మేటప్పుడు కొనే వాడు ధర చెప్పడ మేంటో నాకు అస్సలు అర్ధంకాలేదు. అమ్మ ని అడుగు దామను కున్నా అమ్మ ఏడుస్తుందికదా ఒద్దులే నాన్నవచ్చాక ఈ విషయంఅడగాలి. నాన్న నేనేమడిగినా చెపుతాడు అవి నాకు కొన్ని అర్ధమవక పోయినా నాన్న చెపుతుంటే అలాగే వినాలనిపిస్తుంది.
చీకటి పడ్డాక నాన్నొచ్చాడు. అమ్మా నాన్నా చాలా సేపు మాట్లాడు కున్నారు. నాన్న కూడా ఏడ్చాడు. నాకు భయమేసి నిద్రపోయాను.

పొద్దున్నే లేచేసరికి నా పక్కనే కూచును కనిపించాడు నాన్న. నిన్న జరిగింది గుర్తొచ్చింది,

"ఎందుకు నాన్నా మన పంట వాళ్ళు అన్యాయపు రేటు కి కొన్నారు?"
"మన అవస రాన్ని కనిపెట్టి వాడు ధర కడు తున్నాడు" చెప్పాడు నాన్న.
"మరి కొట్టు లో మనంకొంటే కొట్టు వాళ్ళే ధర చెపుతారుగా!"
"అక్కడా మన అవసరాన్ని కనిపెట్టి వాడే ధర చెబుతాడు. సంవత్సర మంతా కష్ట పడి చేసిన పనికి రూపాయి పెట్టిన చోట అర్ధరూపాయి కూడా రాలేదు. వచ్చిన ఆడబ్బు కూలీలకి ఇవ్వటానికే సరి పోతుంది. అప్పు పెరుగుతూనే ఉంది. ఒకో సంవత్సరం ఒకో కారణంగా పంట దెబ్బ తింటుంది. మంచి పంట వచ్చినప్పుడు ఇలాగుంది." అన్నాడు.

"మరెలా నాన్నా అలాగైతే?"
"గవర్న మెంటు సరైన ధర ఇచ్చి మన పంట కొంటే అప్పులు తీరి మళ్ళీ పంటేయ టానికి బ్రతికుంటాం. ఇలాగే ఐతే ఈ వ్యవసాయంకన్నా ఏసిటీకో పోయి ఏ కూలి పనో చేసుకుంటే కనీసం ఆకూలి డబ్బైనా దక్కుతుంది. ఇక్కడ మన పొలం లో మనంచేసే కూలీ కీ విలువ లేదు.." అంటూ ఇంకా చాలా చెప్పాడు.
గవర్నమెంటు మన పంట కొంటే అసలింకా సమస్యే లేదని నాకు అర్ధమైంది. మరింకేం గవర్నమెంట్ కొనచ్చుగా!
పెద్ద మాష్టారు గారు రాయగానే వచ్చి బడి లో గదులు కడుతున్నారు గా గవర్నమెంటు వాళ్ళు!
అనుకుంటూ రోజు లాగే పాత పుస్త కాలలో దాచుకున్న నా తెల్ల కాగితాన్ని చూసుకుంటుంటే నేనేం చేయాలో తెలిసింది.

పెన్‌సిల్ ముక్క తీసుకుని దాని పై రాయ సాగాను
'గవర్నమెంట్ గారు మాఊళ్ళో రైతు లు పండించే పంటని మీరువచ్చి న్యాయ మైన ధర కి కొనాలి మాకు ఆడబ్బులు ఉంటేనే మీరు కట్టించే బడి గదుల్లో చదువుకోగలం లేకపోతే అందరూ సిటీ వెళ్ళి పోతామని,' ఇంకా నాన్న చెప్పిన విషయాలూ, నాకు తోచినవి అన్నీ రాసేసాను.
దాన్ని తీసుకెళ్ళి నాన్నా ఇదిగో దీన్ని గవర్న మెంటు కి పంపించు. ఇక ముందంతా వాళ్ళే వచ్చి మనంచెప్పిన ధరకే పంట కొంటారు. గవర్న మెంటు చాలా మంచిది నాన్నా మాపెద్ద మాష్టారు రాయగానే వచ్చి బడి గదులు కట్టేస్తున్నారు.

నాన్న నా వైపు ఓసారి చూసి ఏదో అనబోయి, సరే అలాగేరా అని దాన్ని తీసుకున్నాడు.
***
(కొత్తపాళీ గారి కథ రాయండి శీర్షిక కోసం (ఇతివృత్తం తెల్ల కాగితం) నేను రాసిన కథ ఇది)

Beautiful India

10:17 PM at 10:17 PM

హి హి హి ....

4:12 PM at 4:12 PM

ఆదివారం ఎప్పటిలాగే ఎంచక్కా తలంటు కొని బుట్ట బొమ్మ లా రెడీ అయి, ఆడుకోటానికి నా ఫ్రెండ్ ఇంటికి బయల్దేరాను. (ఇప్పుడంటే అన్ని రోజులూ ఒక్క లాగే అనిపిస్తున్నాయి చిన్నప్పుడు ఆదివారం అంటే నాకు ఓ పెద్ద పండగే) వాళ్లింటికి వెళ్లే సరికి ఆ మొద్దు ఇంకా రెడీ అవలేదు. ఆదివారం విలువ ఈమొద్దు ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమిటో నని బాధ పడిపోతూ వుంటే ఓ పుస్తకం కనిపించింది ఇంకేం అది పట్టు కుని హాల్లో సెటిలయ్యా. మల్లిక్ పుస్తకం అనుకుంటా సీరియస్ గా నవ్వుతూ దాంట్లో మునిగి పోయిన టైమ్‌ లో ఎవరో ఒక అబ్బాయి(అబ్బాయంటే చిన్న వాడేమీ కా దు) వచ్చాడు.
చచ్చేంత నవ్వు పుట్టించే ఆ పుస్తకం చదువు తూ నేను మాట్లాడాను.
పాపా మీ నాన్న వున్నారా?
ఆ వున్నారు (పుస్తకం లోంచి తలెత్తకుండా చెప్పాను).
పిలవ్వా.
ఆయన ఇక్కడికెందుకొస్తారు కావాలంటే నువ్వే అక్కడికి పో (పుస్తకం లో ఓ జోక్ ) హి హి
మీ అమ్మ లేదా?
వుంది. ( వీడెవడో నన్నీ పుస్తకం చదవ నిచ్చే ట్టు లేడు, అది రెడీ అయ్యి వచ్చే లోపల ఎలాగైనా మొత్తం చదివేయాలి)
పిలువు
మా అమ్మ రాదు (పుస్తకం లో జోక్) హి.
మీ నాన్న గారి ని కలవడానికి వచ్చాను.
వెళ్లి కలువు హి హి..
ఏరీ
ఇక్కడెందుకుంటారు , హ హ హ.... (ఇక్కడేమో కళ్ల లో నీళ్లొచ్చేంత జోక్స్)
ఎక్కడున్నారు!
మాఇంట్లో,,, హ్హో హ్హో...
అందుకే వచ్చా.
ఓ హ్హో హ్హో.... పుస్తకం లో తట్టుకోలేనంత నవ్వులు సమాదానం చెప్ప కుండా సోఫా లో పడి పొర్లి పొర్లి నవ్వాను.
సరే సాయంత్రం వస్తా నాన్న గారితో చెప్పు.
హ్హ హ్హ.. సరె హి హి..
బాప్ జీ గారిని కలిసి మళ్లీ వస్తానని చెప్పండి.
బాపూ జీ నికలిస్తే మళ్లీ ఎలా వస్తావు, హి హి హి...
బాప్ జీ నీకు తెలుసా!
నా కేంటి అందరికీ తెలుసు , హి హి హి ..
అక్కడకే ఎళుతున్నా, సాయంత్రం వస్తా.
అక్కడకి ఎళ్లడమే మళ్లీ రావు,, హ్హ హ్హా...
ఏవయ్యింది బాప్ జీ కి?
బాపూ జీ ఎప్పుడో చనిపోయారు, గాడ్సే కాల్చి చంపాడంట... హ్హి హ్హి హ్హి ...
అనుమానం గా ఎనిక్కెన్నిక్కి చూసుకుంటూ పరిగెత్తు కుంటూ వెళ్లి పోయాడు.
అంతలోకి నా ఫ్రెండ్ వచ్చింది.
మీ ఇంటికి ఓ పిచ్చోడు వచ్చాడే మా అమ్మనాన్న లని పిలవమని లేకపోతే గాంధీ తాత దగ్గరికి వెళిపోతానని ఏదేదో మాట్లాడాడు నేను భయ పడకుండా మాట్లాడి పంపించేసా గొప్ప గా దానికి చెప్పి , ఎంచ్చక్కా హాయిగా ఆడుకుని అన్నం టైమ్‌ కి మా ఇంటి కెళ్లి పోయా.

అప్పుడొచ్చినతను మళ్లీ సాయంత్రం వాళ్లింటికి వెళ్లాడట, ఉదయాన్నే వచ్చానండీ మీ చిన్న అమ్మాయి గారు ఉన్నారు . దేవుడు మీకు చాలా అన్యాయం చేసాడండీ అని మొదలు పెటాడట.
ఏది మాట్లాడు తున్నా అదే పాట అన్యాయం జరిగి పోయింది అని.
వాళ్ల కేమీ అర్దం కాక ఏంటని అడిగితే,
బంగారు బొమ్మ లా వున్న అంత చక్కటి అమ్మాయికి పిచ్చి, అన్యాయం కాక పోతే ఏంటండీ. ఆ దేవుడు మంచి వారికే అన్ని కష్టాలు పెడతాడు, పుట్టు కతో ఉందా లేక మద్య లో వచ్చిందా? అంటూ ఏదేదో మాట్లాడాడంట.

నాకుందే ఒక అమ్మాయి ఈ పాపే, చిన్న వాడు అబ్బాయి ఇంకా పిచ్చి వాళ్లెవరూ లేరు అని చెప్తే నమ్మకుండా , ఎవరికీ తెలియొద్ద ని అలా దాచివుంచితే పిచ్చి ఇంకా ముదిరిపోద్ది , ఎవరూ ఏం అనుకోరు గాని కాస్త అందరి తో కలిపి పెంచండి బంగారు బొమ్మaలాగుం ది తలచు కుంటే నేకడుపు తరుక్కు పోతుంది అంటూ వెళ్లిపోయాడట.
మిత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు