సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి

5:57 PM at 5:57 PM

మన పూర్వీకులు ఎవరు, ఎక్కడనుండి వచ్చాం ? పూరీకుల జీవనం, సంస్కృతిలపై ఆసక్తే మనిషి చరిత్ర అధ్యయనానికి కారణాలు. గత చరిత్ర పై ఆసక్తి, భవిష్యత్తు పై ఆశ మానవుడి సహజ లక్షణం.
మానవుని పరిణామ క్రమం, రాజుల, రాజ్యాల గురించిన కుతూహలం ప్రతి ఒక్కరికీ సహజంగా ఉంటుంది, అలాంటి ఆసక్తి తోనే నేను ఈ పుస్తకాన్ని చదవటం జరిగింది. మొదటి నుండి చివరి వరకు వదలకుండా చదివించేలా వున్న శైలీ, కథనం. భౌగోళిక పరిస్తితులతో మొదలెట్టి , ఇటీవలి చారిత్రక పరిశోధనల వరకూ మన కళ్ళ ముందు కదలాడేలా రాసారు రచయిత.

నెగ్రిటో, ఆష్ర్టోలాయిడ్ లతో ప్రారంబించి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనబడే ఈ భూ భాగం లో వర్దిల్లిన అన్ని రకాల జాతులు, రాజ్యాలు, రాజులు, సంస్కృతులు సవివరంగా వివరించారు.
త్రవ్వకాలలో లభించిన శాసనాలు, ఇటీవలి పరిశోధనలు, వేలాదిగ్రంధాలు, శాసనప్రతులు, ఆర్క్యలాజికల్ గ్రంధాలు, నాణేలు మొదలైన వాటిని శోధించి ఈ గ్రంధం రాయబడిందని రచయిత ఇందులో పేర్కొన్నారు. దీన్ని 5 భాగాలు గా ప్రచురించారు.
1. ప్రాచీనయుగం నుండి -క్రీ.శ.624 వరకు.
2. హిందూ , ఆంధ్ర -క్రీ.శ.624 నుండి 1323 వరకు.
3. ముస్లీం , ఆంధ్ర - క్రీ.శ.1323 - 1760.
4. బ్రీటీష్ ,ఆంధ్ర -క్రీ.శ. 1760-1956.
5. ఆధునికయుగం -1956 -1996.

వీటిలో ఇది మొదటి గ్రంధం, 450 పేజీలు గల ఈ పుస్తకం లో పూర్వ ప్రాచీన శిలాయుగం నుండి మెదలు పెట్టి వరుసగా తామ్ర,ఇనుప యుగాలు. తెగలు. ఇతిహాసకాలం, మహాబలిపుర, కిష్కింద, పురాణయుగం. చారిత్రక యుగం, భౌద్ద ,మగధ, నంద, మౌర్య, శాతవాహన, ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య, ఆనంద, బృహత్పలాయ, శాలంకాయన, విష్ణుకుండిన మొదలైన వారి కాలం లోని రాజ్యాలు, రాజులు, కోటలు, కట్టడాలు, సంస్కృతి, వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, పరిపాలన, నాణేలు, బాషలు, దుస్తులు, అలంకరణ, ఆర్దిక పరిస్థితులు, ప్రపంచం లోని ఇతర దేశాలtతోవాణిజ్యంమొదలైనవివరాలు, దేవాలయాల ఆవిర్భావం, తెలుగు భాషాపరిణామ క్రమం విపులంగా దీనిలో పొందు పరిచారు.
ప్రాచీన ఆంధ్రదేశ సంస్కృతికి అద్దం పట్టే విజయపురి(నాగార్జున కొండ) విశేషాలు, కోట అవశేషాలు, సంస్కృతి గురించి దీనిలో తెలుసుకోవచ్చు.

ఇవే గాక ఆగ్నేయాసియా లోని ఆంధ్ర రాజ్యాలు, సింహళం, బర్మ, ఇండో చైనా, వియత్నం, కాంబోడియా, సయాం, మలయా, ఇండోనేషియా, జావా, సుమిత్ర, బోర్నియో, బలి మొదలైన చోట్ల బయల్పడిన హిందూ రాజుల శాసనాలు, ఆలయాలు, దక్షిణ భారత లిపి లో అక్కడ లభించిన శాసనాలు, అక్కడ వర్ధిల్లిన ఆంధ్ర రాజ్యాల గురించికూడా ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు.
ఇది చదివాక రచయిత గారి కృషి, పరిశోదన ఎంత గొప్పవో మనకి తెలుస్తుంది.

ఈ పుస్తకం నా దగ్గర సంవత్సరం నుండీ ఉన్నా అంత పెద్దదని చదవటానికి బద్దకం వల్ల చదవనేలేదు. చదవటం మొదలెట్టాక ఇంత మంచి పుస్తకాన్ని ఇంతకాలం చదవనందుకు చింతించా. అసలు చరిత్ర పుస్తకాలు చదవటం పెద్ద ఆసక్తీ లేకుండేది. ఏదో స్కూల్ లో చదుకున్నదే తప్పించి మళ్ళీ ఈ అంశానికి సంబంధించిన పుస్తకాలు కొనలేదు. ఈ పుస్తకాన్ని ఎవరో మిత్రులు నాకు బహుమతి గా ఇచ్చారు అదెవరో అస్సలు గుర్తుకు రావట్లేదు దాని పై పేరు చూస్తే ఒక్క డాక్టర్ అన్నది తప్పఆ సంతకం అర్దం కావట్లేదు (బ్రహ్మరాత). బహుశా ఏదో సందర్భం లో గుర్తు గా ఇచ్చుంటారు వారికి నా దన్యవాదాలు .

పుస్తకం పేరు --- సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి, మొదటి భాగం
రచయిత పేరు ---ముప్పాళ్ళ హనుమంతరావు గారు
వెల -----135/-

7 comments:

Anonymous said...

Hi Where can i find this book?

రవి వైజాసత్య said...

చాలా సమగ్రమైన పరిశోధనతో సరళమైన భాషలో వ్రాసిన గ్రంథమిది. తెలుగు వారందరూ తప్పక చదవదగినది

ramya said...

గోపి గారు మీరు ఇండియా లో ఉన్నట్లయితే విశాలాంధ్ర లో చూడండి, లేదా పుస్తకం లో ఇచ్చిన అడ్రస్ -andhra bookstall, main road, rajahmundry. లో దీన్ని పొందగలరు.

Anonymous said...

మీకు ఐతే పుస్తకాలు బహుమానంగా ఇచ్చువారు ఉన్నందున హాయిగా చదువుకోగలరు మాకు ఆ అదృష్టము లేదు.కొని చదవక తప్పదు ఏం చేస్తాం కొంటాను.

ramya said...

అయ్యో , అనానిమస్ గారు అంత బాధ ఎందుకండీ . మీ పేరు అడ్రెస్ చెప్పండి్, మీకు కావాలంటే నేను ఓ పుస్తకం పంపిస్తాను ,దానికేం భాగ్యం .

విశ్వనాధ్ said...

(దానికేం భాగ్యం అన్నరంటే 130 మిగులన్నమాట)
అలా పెన్ను జారారంటే మేము మేమంచు కుప్పలుగ వచ్చు, అడ్రసులు వెల్లువై (నన్నుకూడా చేర్చుకొని)
తస్మాస్ జాగ్రత జాగ్రత.

ramya said...

@vishwanath; :-)